నల్గొండ

దమ్ముంటే చర్చకు సిద్ధమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోమటిరెడ్డికి ఎమ్మెల్యే వీరేశం సవాల్
నల్లగొండ రూరల్, మార్చి 6: అధికార పార్టీపై, సిఎం కెసిఆర్‌పై, జిల్లా మంత్రిపై, తనపై అసత్యపు ఆరోపణలు చేస్తూ అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని, దమ్ముంలే చర్చకు సిద్ధంగా ఉండాలంటూ నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సవాల్ విసిరారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బండా నరేందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దుబ్బాక నర్సింహ్మరెడ్డితో కలిసి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న మంత్రి జగదీశ్వర్‌రెడ్డిపై, తనపై అసత్యపు ఆరోపణలు మాట్లాడడం తగదని, ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏం చేయాలో తోచక ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రాజెక్టులు, కాంట్రాక్టుల పేరుతో వేలకువేలు కొల్లగొట్టాడని, నేడు ఆ అవకాశం లేకే తమపై నిందలు మోపుతున్నాడని, తన కాంగ్రెస్ నాయకుల కేసుల ఉపసంహరణ కోసమే పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. నకిరేకల్ ఘటనతో తమకేమీ సంబందం లేదని ఎఫ్‌ఐఆర్‌లో ఉందని, మా నాయకులు ఇసుక దందాకు సహకరించడంలేదని, అలాంటి ఘటనలపై సాక్ష్యాలతో నల్లగొండలోగాని, నకిరేకల్‌లోగాని చర్చకు రావాలన్నారు. తాము చట్టాన్ని గౌరవిస్తున్నామని, తాము ఏ అధికారులను బెదింరించలేదని పేర్కొన్నారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని, మీ తమ్ముడు రాజగోపాల్‌రెడ్డితో సహా ముగ్గురం రాజీనామ చేసి ఎన్నికల్లో నిలుద్దామన్నారు. త్వరలో బ్రాహ్మణ వెల్లంల పనులతోపాటు వివిధ పనులలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీస్తామన్నారు. ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని కోరారు.