రంగారెడ్డి

ఓటు వేసేటప్పుడు సూచనలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: ఈనెల 27న జరగనున్న ఎంఎల్‌సి ఎన్నికలో స్థానిక సంస్థ నియోజకవర్గానికి దామాషా ప్రాతినిధ్య పద్ధతిలో బదిలీ చేయదగు ఒకే ఓటు విధానం ద్వారా ఎన్నిక జరుగుతుందని జాయింట్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమ్రపాలి ఓ ప్రకటనలో తెలిపారు. ఓటరు తాను మొదట ప్రాధాన్యత ఇవ్వదలచుకున్న అభ్యర్థి పేరు ఎదుట ఖాళీ గడిలో (1)ను నింపాలని మిగతా అభ్యర్థుల పేర్లకెదురుగా తమ ప్రాధాన్యతననుసరించి 2,3,4 రాయాలని ఆమె తెలిపారు. ఒక్కరికన్నా ఎక్కువ అభ్యర్థులను ఎన్నుకోవలసినప్పుడు కూడా (1) ఒక అభ్యర్థికి మాత్రమే సూచించాలని మొదటి ప్రాధాన్యత నింపని లేదా రెండు మొదటి ప్రాధాన్యతలు నింపిన అట్టి ఓటు తిరస్కరిస్తామని అన్నారు. పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రంతో పాటు ఇచ్చిన ఉదారంగు స్కెచ్ పెన్నుతో మాత్రమే ఓటు వేయాలని ఇతర వేరే పెన్నును వాడితే బ్యాలెట్ చెల్లుబాటు కాదని చెప్పారు. అభ్యర్థి పేరు ఎదురుగా సంఖ్యలు మాత్రమే వేయాలని, టిక్ మార్క్ తదితర గుర్తులను వేస్తే అది చెల్లదని అన్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరని తెలిపారు.
ఎన్నికల ప్రచారం డిసెంబర్ 25 సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందని దీన్ని ఎవరూ అధిగమించకూడదని అన్నారు. అదేవిధంగా డిసెంబర్ 25 నుండి మద్యం విక్రయ కేంద్రాలను కూడా ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు మూసివేస్తామని అన్నారు. నిరక్షరాస్యత ఓటర్లకు సహాయకుని కోసం 50 మంది దరఖాస్తులు చేసుకున్నారని, దీన్ని పరిశీలించి 12 మందికి మాత్రమే సహాయకులను అనుమతించినట్టు వివరించారు.