అంతర్జాతీయం

తప్పు మీది.. బాధ్యత మాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరే ఎక్కువ భారం మోయాలి
లేదంటే నైతిక తప్పిదమే అవుతుంది
అభివృద్ధి చెందిన దేశాలకు భారత ప్రధాని మోదీ హితవు

పారిస్, నవంబర్ 30: శిలాజ ఇంధనాల ఆధారంగా సంపన్నవంతమై బలపడిన అభివృద్ధి చెందిన దేశాలు.. కర్బన ఉద్గారాలను తగ్గించే భారాన్ని భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపైకి నెట్టితే అది నైతికంగా తప్పవుతుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి చేస్తున్న సమష్టి కృషిలో అనుసరించాల్సింది ఉమ్మడి సూత్రమే అయినప్పటికీ బాధ్యతల్లో తేడాలు ఉండాల్సిందేనని మోదీ అన్నారు. లేనిపక్షంలో అది ‘నైతికంగా తప్పు’ అవుతుందని ఆయన సోమవారం నాటి ‘ఫైనాన్షియల్ టైమ్స్’ ఒపీనియన్ సెక్షన్‌లో రాశారు. వాతావరణ మార్పుకు వ్యతిరేకంగా సాగుతున్న పోరులో అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ భారాన్ని మోయడం ద్వారా తమ బాధ్యతను నెరవేర్చాలని మోదీ డిమాండ్ చేశారు. వాతావరణ మార్పుపై సిఓపి21 సదస్సు సోమవారం ఇక్కడ ప్రారంభమైన రోజే కాకతాళీయంగా బ్రిటన్‌లోని ప్రముఖ ఫైనాన్షియల్ దినపత్రికలో ఈ వ్యాసం ప్రచురితమయింది. ‘శిలాజ ఇంధనాల ప్రభావం గురించి మానవ సమాజానికి తెలియని రోజుల్లోనే అభివృద్ధి చెందిన దేశాలు వాటి ఆధారంగా సంపన్నవంతమై బలపడ్డాయని ఆయన అన్నారు. ‘శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అందుబాటులోకి వచ్చాక.. అభివృద్ధి యాత్రను అప్పుడే ప్రారంభించిన దేశాలు కూడా పురోగతిలో శిఖరాగ్ర స్థానానికి చేరుకున్న అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా బాధ్యతను మోయాలని వారు (అభివృద్ధి చెందిన దేశాలు) వాదిస్తున్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువ బాధ్యతను మోయాలనే కొత్త చైతన్యం వచ్చింది. సాంకేతిక పరిజ్ఞానం ఉనికిలోకి వచ్చిందంటే దానర్థం అది భరించగలిగే స్థాయిలో ఉందనో, అందుబాటులో ఉందనో కాదు’ అని మోదీ పేర్కొన్నారు. ‘న్యాయసమ్మతమైన డిమాండ్లు ఏంటంటే, కొంచెం కార్బన్‌ను మనం సురక్షితంగా మండించి అభివృద్ధి చెందుతున్న దేశాలను వృద్ధి చెందడానికి వీలు కలిగించాలి. అభివృద్ధి నిచ్చెనలో తొలి మెట్టు మీదే ఉన్న అనేక మంది అవకాశాలను కొద్దిమంది జీవనవిధానం కొల్లగొట్టకూడదు’ అని మోదీ అన్నారు.
గ్రామాలకు భరించగలిగే రీతిలో సౌర విద్యుత్‌ను అందించడానికి 121 సౌర విద్యుత్ సంపన్న దేశాలతో కూటమి ఏర్పాటు చేయాలన్న తన ప్రణాళికను మోదీ వెల్లడించారు. ప్రపంచం వాతావరణ మార్పుపై ఇలాగే స్పందిస్తుందని కూడా తాము ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 150 మంది ప్రపంచ నేతలతో కలిసి మోదీ వాతావరణ సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చారు. ‘మనం ట్రస్టీలుగా వ్యవహరించాలి. సహజ వనరులను తెలివిగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మన భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన గ్రహాన్ని అందించడం మన నైతిక బాధ్యత’ అంటూ మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపు స్ఫూర్తితో తాము పారిస్ క్లైమేట్ సమ్మిట్ వైపు ఆశావాద దృక్పథంతో ఉన్నాము అని మోదీ అన్నారు. వాతావరణ పరిరక్షణకు పాటుపడే భారతీయ సంస్కృతి గొప్పదనం గురించి మోదీ వివరించారు. (చిత్రం) పర్యావరణంపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి జావడేకర్