రాష్ట్రీయం

మోదీతో కన్నా భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ అభిమతమని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మొదటిసారి కన్నా ప్రధాని మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ తనను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చెయ్యడం ద్వారా ప్రధాని తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన స్పష్టం చేశారు. 2019 ఎన్నికలలో ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి అన్ని విధాలుగా శాయశక్తులా కృషి చేస్తానని ప్రధానికి వివరించినట్టు తెలిపారు. ఇప్పటికీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇచ్చిన హామీలకి కట్టుబడి ఉందని, ఏపీకి అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని ప్రధాని స్పష్టం చేశారని ఆయన వెల్లడించారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత, అవినీతి వలన ఆ ప్యాక్యేజీని తెచ్చుకోలేకపోయారని కన్నా ఆరోపించారు. విభజన హామీల అమలుకోసం ఏపీ బీజేపీ నాయకుల బృందం ప్రధానితో సమావేశం కానున్నామని పేర్కొన్నారు. ఇంటింటికి బీజేపీ అన్న కార్యక్రమంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామని కన్నా స్పష్టం చేశారు. కన్నాతో పాటుగా బుద్ద చంద్రశేఖర్, రఘురామ్ ఉన్నారు.