జాతీయ వార్తలు

మోదీ ఓ హిందూ జాతీయవాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లింలపై పోరుకు హిందువులను సన్నద్ధం చేస్తున్నారు
తాజా మేనిఫెస్టోలో ఐఎస్ మిలిటెంట్ సంస్థ విశే్లషణ

న్యూఢిల్లీ, డిసెంబర్ 3 : నరేంద్ర మోదీ ‘ ఆయుధాలను పూజించే ఓ మితవాద హిందూ జాతీయ వాది అని తమ నంబర్ వన్ శత్రువైన ముస్లింలపై భవిష్యత్ పోరు కోసం హిందువులను సిద్ధం చేస్తున్నారని ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థ తన తాజా మేనిఫెస్టో ‘బ్లాక్‌ఫ్లాగ్స్ ఫ్రమ్ ఇస్లామిక్ స్టేట్’లో పేర్కొంది. అంతేకాదు తమ పోరును భారత్‌కు విస్తరించి తీరుతామని కూడా అది స్పష్టం చేసింది. ‘ఇస్లామిక్ స్టేట్ ఇప్పుడు ఇరాక్, సిరియాలను దాటి విస్తరిస్తోంది. అది ఇప్పుడు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లలోకి విస్తరిస్తోంది’ అని ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ దినపత్రిక తెలిపింది. కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ అయిన ఐఎస్‌ఐఎస్ భారత దేశ రాజకీయ పరిస్థితులను విశే్లషించడం ఇదే మొదటిసారి. ఆవు మాంసం తినే ముస్లింలను హతమార్చడానికి ఒక హిందూ ఉద్యమం ఎదుగుతోందని కూడా ఆ విశే్లషణ పేర్కొంది. అంతేకాదు భవిష్యత్తులో తమ నంబర్ వన్ శత్రువు అయిన ముస్లింలపై పోరాడడానికి ఆయన ఒక హిందుత్వ ఉద్యమాన్ని తయారు చేస్తున్నాడని కూడా ఐఎస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ మేనిఫెస్టోను ఆ సంస్థ కొన్ని జిహాదీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేసింది.