జాతీయ వార్తలు

మోదీ ప్రభుత్వంపై విపక్షాల సమరశంఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు సమర శంఖం పూరించాయి. కోల్‌కతాలోని బ్రినేడ్ మైదానంలో తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో విపక్ష నాయకులు మోదీ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తూ, ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తాంగానీ అల్లరిమూకలు చేసే రథయాత్రను బెంగాల్‌లోకి అనుమతించమని అన్నారు. ఈసారి ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని మార్చాలని పిలుపునిచ్చారు. కోట్లాది మందికి అన్నంపెట్టే రైతన్న ఈరోజు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ అన్నారు. దేశంలో మార్పు సాధించటం కోసమే తామంతా ఇక్కడకు వచ్చామని అన్నారు. ప్రధాని మోదీ ఓ పబ్లిసిటీ పీఎం అని, మనకు పనిచేసే ప్రధాని కావాలని అన్నారు. బీజేపీ పతనం ప్రారంభమైందని, ఈసారి కొత్త పీఎం వస్తారని అన్నారు. మరో రాజకీయ విప్లవానికి ఈ వేదిక నాందీ కావాలని లోక్‌తాంత్రిక్ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు శరద్‌యాదవ్ అన్నారు. బీజేపీ అవినీతికి రఫేల్ ఒక నిదర్శనమని అన్నారు. బీజేపీ అనుసరిస్తున్న ఐడియాలజీకి తాము పూర్తి వ్యతిరేకమని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా అన్నారు. దొంగలకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నట్లు గుజరాత్ పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ అన్నారు. బీజేపీ అధికారంలోకి రాదనేందుకు ఇదే నిదర్శనమని అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని బీఎస్పీ నేత సతీష్ మిశ్రా అన్నారు. మోదీ ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాలవారీగా విడగొడుతుందని జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. విపక్షాల ప్రయత్నం ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదు దేశాన్ని ప్రమాదం నుంచి కాపాడుకోవటం అని అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్‌టీ వల్ల రాష్ట్రాలకు ఆర్థిక స్వేచ్ఛ లేకుండా పోయిందని కుమారస్వామి ఆరోపించారు. ఇంకా ఈ సభలో అఖిలేష్ యాదవ్, శత్రుఘ్నసిన్హా తదితరులు ప్రసంగించారు.