జాతీయ వార్తలు

కలిసి పనిచేస్తేనే ప్రగతి పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతా ఢిల్లీనుంచే కాదు
రాష్ట్రాలదీ కీలక పాత్రే
ప్రధాని మోదీ ఉద్ఘాటన

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: కేంద్రం, రాష్ట్రాలు భుజంభుజం కలిపి పనిచేస్తేనే దేశ ప్రగతి సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశాభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాష్ట్రాలను కూడా తమ ప్రభుత్వం సంప్రదిస్తోందని హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో చేసిన 45 నిముషాల ప్రసంగంలో స్పష్టం చేశారు. ‘కేవలం ఢిల్లీతోనే దేశ ప్రగతి ముడివడి లేదు. రాష్ట్రాలు బలంగా నిలబడి, వెన్నుదన్నుగా నిలిస్తేనే అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు వెళ్లగలుగుతాం’ అని తెలిపారు. రాష్ట్రాలను కలుపుకుని ముందుకు సాగేందుకు ఎన్డీయే ప్రభుత్వం అనేక ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసిందని, దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, బాధ్యత కీలకమైనదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్రాలు కలసికట్టుగా, బలమైన, దృఢమైన ప్రాతిపదికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇలాంటి సానుకూల వాతావరణం, కలిసి పనిచేయాలన్న భావన కేంద్రం, రాష్ట్రాల మధ్య బలపడితే ప్రగతి ఫలాలు వాటంతట అవే సమకూరుతాయని తెలిపారు. రాష్ట్రాల గురించి, వాటి శక్తిసామర్థ్యాల గురించి ప్రపంచ దేశాలు తెలియాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఓ పక్క వర్తమాన భారత స్థితిగతుల్ని, ప్రగతి వేగాన్ని పెంచాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తూనే మోదీ తనదైన శైలిలో ప్రసంగాన్ని సాగించారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు ప్రజలు ఇచ్చిన నిర్ణయాత్మక అధికారం దేశాభివృద్ధికి అత్యంత కీలకమని తెలిపారు. కేంద్రంలో బలమైన, స్థిరమైన ప్రభుత్వం ఉండటం చాలా ముఖ్యమని, అభివృద్ధి కోణంలో ఈ వాస్తవాన్ని విస్మరించడానికి వీల్లేదని తేల్చిచెప్పిన మోదీ ‘మిశ్రమ తీర్పులు నిరంతరం రాజకీయ అనిశ్చితికి దారితీస్తాయి’అని అన్నారు. గత ఏడాది తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టడానికి ముందు సర్వత్రా నిరాశానిస్పృహలు తాండవించాయని గుర్తు చేశారు. రాష్ట్రాల్లో అభివృద్ధి వేగానికి ఊతాన్నిచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, వంద నగరాల్లో ఎల్‌ఇడి బల్బుల వినియోగాన్ని పెంపొందిస్తున్నామని, లక్ష్యిత వర్గాలకు సబ్సిడీలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ రంగ సంస్థల పని తీరులోనే మార్పు తీసుకొచ్చి వాటిని అభివృద్ధి బాట పట్టిస్తున్నామని మోదీ వివరించారు. ‘నేను ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరించి, సబ్సిడీలను తగ్గించి ఉంటే సంస్కరణ వాదులు హర్షించేవారు..రోజుల తరబడి నాకు కరతాళ ధ్వనులు వినిపించి ఉండేవే..’నని మోదీ పేర్కొన్నారు. కానీ, మరో మార్గంలో ముందుకు వెళ్లినా అవే ఫలితాలను తాను సాధిస్తున్న వాస్తవాన్ని వారు గుర్తించడం లేదన్నారు. తన పిలుపు మేరకు 40లక్షల కుటుంబాలు ఎల్‌పిజి సబ్సిడీని వదులుకున్నాయని తెలిపారు. దేశంలో అద్భుతమైన ఆలోచనలకు కొదవ లేనప్పటికీ వాటిని సరైన విధంగా ఆచరిస్తేనే విజయం సాధించగలుగుతామన్నారు. ఈ అంశంపైనే ఎన్డీయే సర్కార్ దృష్టి పెట్టిందని, మాటల్లో కాకుండా చేతల్లోనే ప్రగతిని చూపించే లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి రికార్డును తన ప్రభుత్వం అధిగమించిందని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న 85 ప్రధాన ప్రాజెక్టుల్లో 65 చోట్ల పనులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.
(చిత్రం) హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ