జాతీయ వార్తలు

ప్రధాని పదవి రేసులో లేను:గడ్కరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: తాను ప్రధాని పదవి రేసులో లేనని కేంద్ర మంత్రి గడ్కరీ మరోసారి స్పష్టంచేశారు. తనపై వచ్చేవన్నీ సత్యదూరాలని అన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 300 స్థానాల్లో గెలుస్తాయని ఆయన చెప్పారు. నాగపూర్ లోకసభ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన తదనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహారాష్టల్రో బీజేపీ-సేన కూటమి 40 సీట్లలో విజయం సాధిస్తుందని తెలిపారు. గత ఎన్నికల్లో 2.80 లక్షల మెజార్టీతో విజయం సాధించిన గడ్కరీ ఈసారి కూడా అంతకన్నా ఎక్కువ మెజార్టీతో విజయం సాధిస్తానని వెల్లడించారు. బీజేపీ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలకంటే ఎక్కువే చేసిందని ఆయన తెలిపారు. ఈసారి బీజేపీ 270 స్థానాలు గెలుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.