జాతీయ వార్తలు

ట్విట్టర్‌లో మోదీ రికార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ అనుచరుల (ఫాలోవర్ల) సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. గత ఏడాది వ్యవధిలో ‘ట్విట్టర్’లోని మోదీ ఖాతాకు రికార్డు స్థాయిలో అనుచరులు అనుసంధానమవడంతో ఆయన మొత్తం ఫాలోవర్ల సంఖ్య 1.6 కోట్లు దాటింది. కేవలం రెండు నెలల వ్యవధిలో మోదీ ఖాతాకు 10 లక్షల మందికిపైగా అనుచరులు అనుసంధానమయ్యారని, దీంతో ఆయన మొత్తం ఫాలోవర్ల సంఖ్య 1.61 కోట్లు దాటిందని ‘ట్విట్టర్’ వెల్లడించింది. గత ఏడాది మే 26వ తేదీన మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి 1.19 కోట్ల మంది అనుచరులు ఆయన ‘ట్విట్టర్’ ఖాతాకు అనుసంధానమయ్యారు. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 22న ‘ట్విట్టర్’లో మోదీ ఫాలోవర్ల సంఖ్య 1.5 కోట్లు దాటింది. అంతేకాకుండా 12 నెలల వ్యవధిలో (2014 సెప్టెంబర్ 17 నుంచి 2015 సెప్టెంబర్ 17వ తేదీ వరకు) అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లను (88 లక్షల మందిని) సంపాదించుకున్న భారతీయ ఖాతాదారుడిగా కూడా మోదీ రికార్డులు నెలకొల్పాడని ‘ట్విట్టర్’ పేర్కొంది.