జాతీయ వార్తలు

రాష్ట్రంలో అణు విద్యుత్కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోదీ రష్యా పర్యటనలో ఖరారుకు అవకాశం

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: కుడన్‌కుళం అణు విద్యుత్కేంద్రానికి సంబంధించిన ఐదు, ఆరు యూనిట్లు రాష్ట్రంలో ఏర్పాటుకు రష్యాతో కేంద్రం ఒప్పందం చేసుకోనుంది. కుడన్‌కుళం అణు విద్యుత్కేంద్రం కూడా రష్యా సహకారంతోనే ఏర్పాటు చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఏపిలో కొత్తగా అణు విద్యుత్ యూనిట్లు నెలకొల్పాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా ఈవారంలో మాస్కో పర్యటనకు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోదీ వీటి ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. కుడన్‌కుళం ప్రాజెక్టు ఐదు, ఆరు యూనిట్లు ఆంధ్రలో ఏర్పాటుచేస్తూ ఇరుదేశాల మధ్య ఒప్పందం జరుగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్థలం ఎంపికకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. ఆంధ్రను అనువైన ప్రాంతంగా నిర్ణయించినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రం ఇప్పటికే తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కొవ్వాడ వద్ద యుఎస్ బేస్డ్ నూక్లియర్ వెండర్, జిఇ- హిటాజీ నూక్లియర్ ఎనర్జీ ప్రాజెక్టు నెలకొల్పాలని నిర్ణయించారు. ఈనెల 23, 24 తేదీల్లో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో దీనికి సంబంధించి ఒప్పందం చేసుకుంటారు. భారత్ పౌర అణు రంగంలో రష్యా కీలక భాగస్వామిగా ఉంది. గతలో పుతిన్, మోదీల సమావేశం సందర్భంగా ఇక్కడ అణు రియాక్టర్లు నెలకొల్పడానికి రష్యా ముందుకొచ్చింది. 2035నాటికి భారత్‌లో 12 అణు రియాక్టర్లు ఏర్పాటు చేస్తామని పుతిన్ ప్రకటించారు. 33వేల కోట్లతో వ్యయంతో కుడన్‌కుళం అణువిద్యుత్ కేంద్రం 3, నాలుగు యూనిట్లు ఏర్పాటుకు గత ఏప్రిల్‌లో భారత్, రష్యాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ రెండు యూనిట్లు తమిళనాడులోని తిరునెల్వె జిల్లాలో ఏర్పాటు కానున్నాయి.