జాతీయ వార్తలు

మోదీకి జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు మొర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న తమను ఆదుకోవాలని జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు ప్రధాని మోదీకి విజ్ఞప్తిచేశారు. ఎస్‌బీఐ నుంచి రూ.1500 కోట్లు విడుదల చేయించి తమ సంస్థలోని రెండు వేల మంది ఉద్యోగులను ఆదుకోవాలని వారు మొర పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహణ బాధ్యతలను ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్టియం చూస్తున్న విషయం తెలిసిందే. సంస్థ కార్యకలాపాలు కొనసాగాలంటే తక్షణమే రూ.1500 కోట్లు విడుదల చేయాలని ఎస్‌బీఐని కోరుతున్నాం. అలాగే సంస్థలోని 20,000 ఉద్యోగాలను కాపాడాలని ప్రధాని మోదీని కూడా అభ్యర్థిస్తున్నాం’’ అని నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌(ఎన్‌ఏజీ) వైస్‌ ఛైర్మన్‌ అదిమ్‌ వలియానీ సోమవారం తెలిపారు.