జాతీయ వార్తలు

ప్రజ్ఞాను హేయంగా అవమానించారు:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భోపాల్ బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు హిందూ ఉగ్రవాదం అంటగంటి హేయంగా అవమానించారని ప్రధాని మోదీ అన్నారు. తన శాపం వల్లే ఎటిఎస్ అధికారి హేమంత్ కర్కర్ ఉగ్రవాదుల దాడుల్లో మరణించారని చేసిన వ్యాఖ్యలు నేడు దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకున్నట్లు, క్షమాపణలు కోరుతున్నట్లు ప్రజ్ఞా సైతం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ హిందూ నాగరికతపై ఉగ్రవాదం మచ్చ వేసిన కాంగ్రెస్ నేతలకు ప్రజ్ఞానే సమాధానంగా నిలుస్తుందని అన్నారు. బెయిల్‌పై ఉన్న ప్రజ్ఞాను సమర్థిస్తూ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సైతం బెయిల్‌పైనే ఉన్నారని, మరి వారినెందుకు పోటీకి దూరంగా ఉంచటం లేదని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోత ఉగ్రవాదం వంటిది కాదా? అని ప్రశ్నించారు. ఒక మహావృక్షం కూలిపోయినప్పుడు భూకంపం వస్తుందని ఆనాడు రాజీవ్‌గాంధీ వ్యాఖ్యానించారని, దానిని మీడియా ఎందుకు ప్రశ్నించటం లేదని అన్నారు. సంజౌత ఎక్స్‌ప్రెస్ కేసులో హిందూ ఉగ్రవాదం అంటగట్టారని విమర్శించారు. ప్రజ్ఞా ఓ మహిళ అని, ఓ సాధ్వి అని అలాంటి వ్యక్తిని హేయంగా అవమానించారని అన్నారు. తప్పుడు పద్ధతిలో హిందూ సంస్కృతిని కాంగ్రెస్ నేతలు విమర్శించారని అన్నారు.