జాతీయ వార్తలు

అఖిలపక్ష భేటీ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జమిలీ ఎన్నికల విధానంపై అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ సీఎం జగన్ కూడా హాజరయ్యారు. సమావేశంలో సీపీఎం కార్యదర్శి సీతారం ఏచూరీ మాట్లాడుతూ జమిలీ ఎన్నికల విధానం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందని అన్నారు. రాజ్యాంగ విధులను ప్రభుత్వం విస్మరించటమేనని పేర్కొన్నారు. కాగా జమిలీ ఎన్నికల విధానాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమర్థించారు. పదే పదే ఎన్నికలు నిర్వహించటం వల్ల అభివృద్ధి ఆగిపోతుందని, ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం ఉత్తమం అని అన్నారు. కాగా ఈ భేటీలో మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోపీ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షాతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు.