జాతీయ వార్తలు

ఆ కుటుంబాలకు కేంద్రం ఆర్థిక సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వలసవచ్చి వివిధ ప్రాంతాల్లో ఉంటున్న 5,300 కుటుంబాలకు కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఒక్కో కుటుంబానికి రూ.5.5లక్షల సాయాన్ని ప్రధాని మంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేవకర్ తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి స్థానచలనం పొంది జమ్మూకశ్మీర్ బయట రాష్ట్రాల్లో స్థిరపడి మళ్లీ తిరిగి రాష్ట్రానికి వచ్చిన 5,300 కుటుంబాలకు కూడా ఈ ఆర్థిక సాయం అందుతుందని మంత్రి వెల్లడించారు. ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో కశ్మీర్‌లోని పలు అభివృద్ధి పనులకు ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేయటమే కాకుండా సరిహద్దు రాష్ట్రంలోని లబ్ధిదారులకు పలు పథకాల్లో పరిహారం ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.