జాతీయ వార్తలు

ప్రజాస్వామ్యంలో కీలక ఘట్టాలకు వేదిక పెద్దల సభ:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ ప్రజాస్వామ్యంలో అనేక కీలక ఘట్టాలకు వేదికగా రాజ్యసభ నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. జీఎస్టీటీ, తలాక్ బిల్లులు వంటివి ఆమోదం పొందాయని, ఆర్టికల్ 370, 35ఏ వంటి బిల్లులకు సంబంధించిన విషయాల్లో రాజ్యసభ పాత్ర మరువలేనిదని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యసభ 250 సమావేశం సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదని, ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఈ సభ చరిత్ర సృష్టించటమే కాదు చరిత్రనే మార్చిందని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ప్రముఖులు రాజ్యసభ పాత్రపై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇది ఎన్నటికీ ద్వితీయ శ్రేణి సభ కాదని అన్నారు. అలాంటి ఈ సభకు సంబంధించిన 250 సమావేశం మహోన్నత ఘట్టంలో తాను పాలుపంచుకోవటం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. భిన్నత్వానికి ప్రతీక రాజ్యసభ అని, సభ్యులు సభ ఔనత్యాన్ని పెంచేలా వ్యవహరిస్తూ దేశ ఔనత్యాన్ని కాపాడుతున్నారని ఆయన అన్నారు.