జాతీయ వార్తలు

ప్రకాశ్‌ జవదేకర్‌కు పదోన్నతి : కొత్త మంత్రుల ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: రాష్ట్రపతి భవన్‌ దర్బార్‌ హాలులో మంగళవారం ఉదయం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్న ప్రకాశ్‌ జవదేకర్‌కు పదోన్నతి లభించింది. కేబినెట్‌ మంత్రిగా ప్రమాణం చేశారు. రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన విజయ్‌ గోయల్‌, మహారాష్ట్ర నుంచి రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున రాజ్యసభకు ఎన్నికైన రామ్‌దాస్‌ అథవలే, అసోంలోని నాగావ్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికైన రాజెన్‌ గొహేన్‌, మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన అనిల్‌ మాధవ్‌ దవే మంత్రులుగా ప్రమాణం చేశారు. మధ్యప్రదేశ్‌లోని మండ్లా నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఫగ్గన్‌సింగ్‌ కులస్తే, పశ్చిమ్‌ బంగాలోని డార్జిలింగ్‌ నుంచి ఎన్నికైన ఎస్‌ఎస్‌ అహ్లువాలియా, కర్ణాటకలోని బీజాపూర్‌ నుంచి ఎన్నికైన రమేష్‌ చందప్ప జిగజినాగి మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రులు ఆరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, జేపీ నడ్డా, బండారు దత్తాత్రేయ, నితిన్‌గడ్కరీ, సదానందగౌడ, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు.