బిజినెస్

పెట్టుబడులకు భారత్ అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమల్లోకి సరళమైన విధానాలు * మలేసియా కార్పొరేట్లతో ప్రధాని మోదీ

కౌలాలంపూర్/పుత్రజయ, నవంబర్ 23: విధానపరమైన నిర్ణయాల్లో అనిశ్చితి తొలగిపోయిందని, పారదర్శకమైన, సరళతరమైన విధానాలుంటాయని మదుపరులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మలేసియా పర్యటనలో భరోసా ఇచ్చారు. మలేసియా కార్పొరేట్ లీడర్లతో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మలేసియాతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్ చూస్తోందన్నారు.
మరోవైపు మలేసియా పర్యటన సందర్భంగా ఆ దేశంతో భారత్ సోమవారం మూడు ఒప్పందాలను కుదుర్చుకుంది. కల్చరల్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అగ్రిమెంట్ 2015-2020లో భాగంగా ఈ మూడు ఒప్పందాలు ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో జరిగాయి. మోదీ, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ ఆధ్వర్యంలో సంతకాలు, ఒప్పందాల మార్పిడి అయ్యాయి.
ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి సైబర్ సెక్యూరిటీపై ఒక ఒప్పందం చేసుకోగా, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి మానిటరింగ్‌పై ఒకటి, ప్రాజెక్టు డెలివరీ, నిర్వహణలో మరొక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నజీబ్‌తో సమావేశం అనంతరం మీడియాతో మోదీ మాట్లాడుతూ ఇరు దేశాలు పరస్పర అవగాహనతో కీలక అంశాల్లో ముందుకెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కాగా, తన ఈ విదేశీ పర్యటన సందర్భంగా మోదీ అక్కడి మదుపరులను ఆకట్టుకునేలా ముందుకెళ్తున్నారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ జిడిపి వృద్ధిరేటు పరుగులు పెడుతోందని, వౌలిక రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని విదేశీ పెట్టుబడులకు భారత్ అత్యంత అనుకూలమంటూ విదేశీ మదుపరులను ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణంతోపాటు కరెంట్ ఖాతా లోటు కూడా అదుపులోనే ఉన్నాయన్నారు. అలాగే ద్రవ్యలోటును నిర్దేశిత లక్ష్యానికి కట్టడి చేస్తామని కూడా మోదీ స్పష్టం చేశారు.