అంతర్జాతీయం

స్నేహమంటే మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటుపోట్లు తట్టుకున్నాం.. వ్యూహాత్మక స్ఫూర్తితో మరింత ముందుకు..

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో శిఖరాగ్ర భేటీలో ప్రధాని మోదీ ఉద్ఘాటన
16 ఒప్పందాలపై సంతకాలు ఉమ్మడిగా సైనిక హెలికాప్టర్ల తయారీ

మాస్కో, డిసెంబర్ 24: రష్యా తమకు అత్యంత బలమైన, విశ్వసనీయమైన మిత్ర దేశమని, ఇరు దేశాల మధ్య నిజమైన వ్యూహాత్మక భాగస్వామ్య బంధముందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రష్యాతో వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా గురువారం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రక్షణ, ఇంధన ఒప్పందాలు, ఇతర కీలక అంశాలపై ఇరు దేశాల ప్రతినిధుల మధ్య మంతనాలు జరిగాయి. మొత్తం 16 ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేసాయి. సైనిక హెలికాప్టర్లను ఉమ్మడిగా తయారు చేయడంతో పాటు అనేక రంగాలకు ద్వైపాక్షిక బంధాన్ని విస్తరించాలని నిర్ణయించాయి. ఈ శిఖరాగ్ర చర్చలు రెండు దేశాల ద్వైపాక్షిక బంధానికి మరింత ఊతాన్నిస్తాయని, సరికొత్త శక్తినీ అందిస్తాయని మోదీ స్పష్టం చేశారు. భారత-రష్యాల మధ్య వార్షిక శిఖరాగ్ర చర్చలు జరగడం ఇది 16వసారి. ఈ సందర్భంగా క్రెమ్లిన్‌లో మోదీ-పుతిన్‌లు ముఖాముఖీ భేటీ అయ్యారు. అనంతరం రెండు దేశాల ప్రతినిధి బృందాలు చర్చల్లో పాల్గొన్నాయి. భారత-రష్యాల మధ్య కేవలం రక్షణ పరమైన సంబంధాలే కాకుండా సాంస్కృతిక సంబంధాల సుదీర్ఘ చరిత్ర ఉందని, ఇప్పుడు రాజకీయ, అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు బలమైన, విశ్వసనీయమైన మిత్ర దేశంగా రష్యా అవతరించిందని మోదీ తెలిపారు. ‘్భరత్‌కు ఎన్నో సంక్లిష్ట సందర్భాల్లో రష్యా వెన్నుదన్నుగా నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం మాటల్లో కాకుండా రష్యాతో భారత్‌కు అత్యంత దృఢమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పుతిన్ ‘రెండు దేశాలు నిజమైన స్ఫూర్తితో వ్యూహాత్మక బంధాన్ని పెంపొందించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కేవలం కొన్ని రంగాలకే పరిమితం కాకుండా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు అనంతంగా విస్తరిస్తున్నాయని, రాజకీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ, ఆర్థిక రంగాల్లోనూ ముందుకు దూసుకుపోతున్నాయి’అని పుతిన్ అన్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించుకునే మార్గాలపై కూడా ఇరు దేశాలు చర్చల సందర్భంగా దృష్టి సారించాయి. రానున్న పది సంవత్సరాల కాలంలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుత పది బిలియన్ డాలర్ల నుంచి 30 బిలియన్ డాలర్లకు విస్తరించేందుకు ఉమ్మడిగా కృషి చేయాలని సంకల్పించాయి. (చిత్రం) రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత్ ప్రధాని మోదీ