రాష్ట్రీయం

ప్రాథమిక విద్యాబోధనలో కొత్త పుంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జెపాల్-ప్రథమ్’తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

హైదరాబాద్, నవంబర్ 21: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాధమిక విద్యాబోధనలో మరింత నాణ్యతను పెంచేందుకు సర్వశిక్షా అభియాన్ ‘జెపాల్-ప్రథమ్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాథమిక విద్యలో అంతర్జాతీయంగా అనేక ప్రయోగాలు చేసి ప్రథమ్ ఇప్పటికే మంచి ఫలితాలను సాధించింది. టీచింగ్ ఎట్‌ది రైట్ లెవెల్ పేరిట సరికొత్త బోధనా విధానాన్ని ఈ సంస్థ పరిచయం చేస్తోంది. ఈపద్ధతి ద్వారా విద్యార్ధులు ఐదోతరగతి వచ్చే సరికి ప్రాధమిక స్థాయిలో వారిక్కావల్సిన అన్ని విషయాల్లో మీద పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో చాలా చోట్ల విద్యార్ధులు ప్రాధమిక విద్యను పూర్తిచేసుకున్నప్పటికీ కనీసం రెండంకెలు కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. సర్వశిక్షా అభియాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ సంస్థ తొలి దశలో ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లాలోని 17 వందల ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో ఈ కొత్త విద్యాబోధను అమలుచేయనుంది. అందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన అభ్యాస, బోధన సామగ్రీని ఉపయోగిస్తుంది. ప్రస్తుతం 3,4,5 తరగతుల విద్యార్ధులకు తెలుగు, లెక్కల పాఠాలను రోజుకు రెండు గంటల పాటు బోధిస్తుంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే అనంతపురంలోని ప్రతి ఐదుగురు విద్యార్థుల్లో ఒకరు తెలుగు, లెక్కల్లో వెనుకబడి ఉన్నారని అందుకే అక్కడ ఈ నూతన విద్యాబోదన విధానాన్ని అమలుచేస్తున్నామని సర్వశిక్షా అభియాన్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ఇషా ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని అన్ని స్కూళ్లలో ఆధునిక విద్యా బోధన విధానాన్ని అమలుచేస్తోంది. అలాగే ఎర్నెట్ ప్రాజెక్టు ద్వారా కూడా విశాఖ, గుంటూరు, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని మొత్తం 280 పాఠశాలల్లో అత్యాధునిక పద్ధతుల్లో విద్యాబోధన అందిస్తుంది. దశలవారీగా ఈ విద్యాబోధన విధానాల ద్వారా రాష్ట్రంలో ప్రాధమిక విద్యలో గట్టి పునాదులు వేసేందుకు విద్యాశాఖతో పాటు సర్వశిక్షా అభియాన్ కృషి చేస్తోంది.