రాష్ట్రీయం

దేవినేని ఉమ నిప్పులాంటి మనిషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంపి రమేష్ పొగడ్త
హైదరాబాద్, నవంబర్ 22: సాగు నీటి ప్రాజెక్టు పనుల్లో 2004 నుంచి 2014 సంవత్సరం వరకు జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఎంపి సిఎం రమేష్ వైకాపా నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ నిప్పులాంటి మనిషి అని సిఎం రమేష్ శనివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. రాయలసీమ ప్రాంతంలో, నెల్లూరు జిల్లాలో అకాల వర్షాలు, వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే వైకాపా అధ్యక్షుడు, ఎపి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం బాధితులను పరామర్శించకుండా, వరంగల్ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు నాలుగు రోజుల పాటు మకాం వేశారని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోవడానికి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. మంత్రి దేవినేని ఉమ నిప్పులాంటి మనిషి అని ఆయన అన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే తమకు పుట్టగతులు ఉండవన్న భయంతో లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆయన తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 9 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేశారని, ఎక్కడా అవినీతి జరగలేదని అన్నారు. అటువంటి వ్యక్తిపై 420, 840 అని విమర్శలు చేయడం భావ్యం కాదని ఆయన తెలిపారు. అలా విమర్శలు చేసిన నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని రమేష్ డిమాండ్ చేశారు.