క్రీడాభూమి

ముగురుజాకు బార్బొరా షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 23: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో మూడోసీడ్ గార్బినె ముగురుజాకు అన్‌సీడెడ్ బార్బొరా స్ట్రయికోవా షాకిచ్చింది. శనివారం మూడో రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆమె 6-3, 6-2 తేడాతో వరుస సెట్లలో గెలిచి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇన్నాళ్లూ అంతగా గుర్తింపు పొందని 29 ఏళ్ల చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బొరా ఈ విజయంతో ఒక్కసారిగా వార్తల్లో పతాక శీర్షికలకు ఎక్కింది. ఈసారి టైటిల్ ఫేవరిట్స్ జాబితాలో ఉన్న ముగురుజా పరాజయంతో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ టైటిల్‌ను నిలబెట్టుకునే ఆశలు మరింత మెరుగయ్యాయి. నాలుగో రౌండ్‌లో ఆమె 14వ సీడ్ విక్టోరియా అజరెన్కాను ఢీ కొంటుంది. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో అజరెన్కా 6-1, 6-1 తేడాతో నవోమీ ఒసాకాను చిత్తుచేసింది.
సీనియర్ అకీడాకారిణి అనా ఇవానోవిచ్ కూడా ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించింది. 15వ సీడ్ మాడిసన్ కీస్ ఆమెను 4-6, 6-4, 6-4 తేడాతో ఓడించింది. ఏకతరీన మకరోవా ర్యాంకింగ్స్‌లో తనకంటే 12 స్థానాలు మెరుగ్గా ఉన్న తొమ్మిదో సీడ్ కరోలినా ప్లిస్కోవాపై 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది. ఏంజెలిక్ కెర్బర్ 6-1, 6-3 స్కోరుతో మాడిసన్ బ్రెంగిల్‌ను, జొహన్నా కొన్టా 6-2, 6-2 తేడాతో డెనిసా అలెర్టొవాను, వర్వరా లెప్చెన్కొ 6-1, 6-3 ఆధిక్యంతో క్వాలిఫయర్ జాంగ్ షుయ్‌ను ఓడించారు. మొత్తం మీద శనివారం నాటి ఫలితాల్లో ముగురుజా పరాజయం మినహా మిగతావన్నీ ఊహించినవే.