Others

మహాముదురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్క చిత్రం కూడా విడుదల కాలేదు. తెలుగు పరిశ్రమ గురించి ఏ మాత్రం అవగాహన వుందో ఎవరికీ తెలియదు. కానీ, అన్నీ తెలిసినట్లుగా చిలక పలుకులు పలికేస్తోంది మల్లు బ్యూటీ కీర్తి సురేష్. ఇటీవలే తెలుగులో రెండు చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కీర్తి, తెలుగు పరిశ్రమ గురించి అన్ని నిజాలు చెప్పేస్తోంది. అది పొగడ్తగా చెబుతోందో, తిడుతూ చెబుతుందో వినేవారికి ఏమీ అర్థం కావడంలేదు. ఉదాహరణకు ఆమె చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి. ‘తెలుగులో సినిమాలు రూపొందించే పద్ధతి మారింది. తెలుగు ప్రజలు ఇపుడు మారిపోయారు. వారి మైండ్‌సెట్‌ను కూడా మార్చుకున్నారు. గ్లామర్ కోసమే సినిమాలు చూసే రోజులు పోయాయి. మంచి కథ వున్న చిత్రాలనే చూస్తున్నారు’ అని అంటోంది. ఇదేంటి అనేకమంది పరభాషా కథానాయికలు వచ్చి ఎన్నో కొన్ని సినిమాలు చేసినా చెప్పలేని నిజాలను కీర్తి సురేష్ ఎలా చెబుతోంది అబ్బా అని టాలీవుడ్‌లో సెలబ్రటీలు అంతా ముక్కుమీద వేలేసుకుని వింటున్నారు.