రాష్ట్రీయం

ముందుకు కదిలిన సచివాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి టౌన్‌షిప్‌లోనే నిర్మాణం
రూ.180 కోట్ల ప్రణాళికకు సర్కారు ఓకే
తొలి విడతగా 90 కోట్ల విడుదల
జూన్ 30కి పూర్తి చేయాలని ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 29: అమరావతి రాజధాని ప్రాంతంలోని మంగళగిరి వద్దకు ఏపీ సచివాలయం తరలింపు ప్రతిపాదన ఖరారైంది. వచ్చే ఆరు నెలల్లోపు రూ.180 కోట్లతో సచివాలయం నిర్మాణానికి అనుమతిస్తూ పూర్తి విధి విధానాలతో సర్కారు మంగళవారం జీవో 278 జారీ చేసింది. అమరావతి టౌన్‌షిప్‌లో సచివాలయం నిర్మాణానికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఆర్‌డిఏను ఆదేశించారు. సిఆర్‌డిఏకు చెందిన స్ధలంలోనే ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయాన్ని నిర్మిస్తారు. మొత్తం వ్యయం రూ.300 కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.150 కోట్లు. మిగిలిన సొమ్మును హడ్కో భరిస్తుంది. హడ్కో నుంచి సిఆర్‌డిఏ రుణం తీసుకుంటుంది. 15-20 సంవత్సరాల్లోపు సిఆర్‌డిఏ ఈ రుణాన్ని 10.65 శాతం వడ్డీ చెల్లించే షరతుపై తీసుకుంటుంది. సిఆర్‌డిఏ టెండర్లను పిలిచే బాధ్యతను అప్పగించారు. సచివాలయం నిర్మాణాన్ని 20 ఎకరాల్లో నిర్మిస్తారు. టెండర్లను ప్రిఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో, సాధారణ విధానంలో ఆహ్వానిస్తారు. 2016 జూన్ 30లోగా సచివాలయ నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. నిర్మాణానికి ముందుకు వచ్చే సంస్ధల మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. దీనికి సంబంధించి విధి విధానాలను సిఆర్‌డిఏ ఖరారు చేస్తుంది. సిఆర్‌డిఏ ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.180 కోట్ల ఖర్చవుతుందన్న అంచనాకు వచ్చింది. రూ.90 కోట్లను విడుదల చేసింది. సిఆర్‌డిఏకు అత్యవసరంగా ఈ పనులు చేపట్టేందుకు రూ.90 కోట్ల వడ్డీ రహిత సొమ్మును మంజూరు చేశారు. మిగిలిన నిధులను హడ్కో నుంచి షరతులకు లోబడి స్వీకరించాలని ఆదేశించారు. సచివాలయం నిర్మాణం పూర్తయిన తర్వాత ఇందులోకి వచ్చే ప్రభుత్వ కార్యాలయాలు నెలవారీ అద్దెను సిఆర్‌డిఏకు చెల్లిస్తారు. అలాగే లీజు కింద కేటాయిస్తారు.