జాతీయ వార్తలు

15వేల కోట్లతో తుపాకుల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఆయుధాల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న సైన్యానికి బలం చేకూర్చేదిశగా కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. భారీ మొత్తంతో తుపాకుల కొనుగోలు ప్రణాళికకు ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. రూ. 15,935 కోట్ల వ్యయంతో తేలికపాటి మెషిన్‌గన్స్, అసాల్ట్ రైఫిల్స్, స్నైపర్ రైఫిల్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన మంగళవారం భేటీ అయిన ప్రభుత్వ కమిటీ ఈ మేరకు తుది నిర్ణయం తీసుకుంది. పెద్దసంఖ్యలో తేలికపాటి మెషిన్‌గన్స్‌తోపాటు 7.4 లక్షల అసాల్ట్ రైఫిల్స్‌ను విదేశాలు రూపొందించిన డిజైన్లలో భారత్‌లోనే తయారు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా 5719 స్నైపర్ రైఫిల్స్‌ను కూడా ప్రత్యేకంగా సైన్యం కోసం కొనుగోలు చేయనున్నారు. వీటిని నేరుగా దిగుమతి చేసుకోనున్నారు. కాగా ఆయుధాల కొనుగోలుకు నిర్ణయం తీసుకునే ప్రభుత్వ అత్యున్నత రక్షణ ఆయుధ సమీకరణ సంఘం (డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్) మంగళవారం భేటీ అయి ఆమోదముద్ర వేసిందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. మొదట్లో ఈ ఆయుధాలను సమీకరిస్తారు. ఆ తరువాత భారత్‌లో వీటిని తయారు చేసే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రణాళికలో భాగంగా రూ. 1819 కోట్లతో కొనుగోలు చేసే తేలికపాటి మెషిన్‌గన్స్ ఎన్ని అన్నది బయటకు పొక్కనీయ లేదు. వీటిని త్రివిధ దళాలకు కేటాయిస్తారు. అలాగే 12,280 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసే 7.4 లక్షల అసాల్ట్ రైఫిల్స్‌ను సైన్యానికి మాత్రమే కేటాయిస్తారు. కాగా తమకు ఆధునిక తుపాకుల అవసరం ఉందని సైన్యం పదకొండు సంవత్సరాల క్రితం ప్రభుత్వాన్ని కోరింది. చాలాకాలంగా మన సైనిక దళాలు ఏకే-47, దేశీయంగా తయారు చేసిన ‘ఇన్సాస్’ రైఫిల్స్‌ను మాత్రమే ఉపయోగిస్తున్నాయి. సరిహద్దుల్లో తీవ్రవాదుల చొరబాట్లను నిరోధించేందుకు తమకు అత్యాధునిక అసాల్ట్ రైఫిల్స్‌ను సమీకరించాలని 1988 నుంచి ప్రణాళికలు రూపొందించారు. సరిహద్దుల్లోని సైనికులకు అధునాతన, అత్యంత సామర్ధ్యమున్న ఆయుధ సామాగ్రిని అందించాలన్న ఉద్దేశంతో త్వరితగతిన తుపాకులు, కార్బయిన్స్, తేలికపాటి మెషిన్‌గన్స్ కొనుగోలు చేయాలని రక్షణ కమిటీ ఆమోదముద్ర వేసిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
అలాగే నావికాదళం కోసం అభివృద్ధి చేసిన టోర్పడో డెకాయ్ సిస్టమ్స్‌ను సమీకరించడానికి కూడా ఈ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యర్థుల నుంచి దూసుకువచ్చే టోర్పడోల సమాచారాన్ని, వాటిని కూల్చివేసేందుకు సూచనలను ఈ సిస్టమ్స్ అందిస్తాయి. ‘మారీచ్’ పేరుతో పిలిచే ఈ సిస్టమ్స్‌ను దేశీయంగా రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) రూపొందించింది. అనేక ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించి అభివృద్ధి చేసిన ‘మారీచ్’ సిస్టమ్స్‌ను బెంగళూరు కేంద్రం గా పనిచేసే భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రూ.850 కోట్ల వ్యయంతో తయారు చేస్తోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.