తెలంగాణ

నకిలీ బంగారంతో బ్యాంకుకు టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, జనవరి 22: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఇండియన్ బ్యాంక్‌లో బ్యాంకు ఉద్యోగితో పాటు అప్రైజర్ కొంతమంది కలసి బ్యాంకుకు నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి రూ.65 లక్షల రుణాన్ని పొంది బ్యాంకుకు టోకరా వేసిన సంఘటన వెలుగు చూసింది. బంగారు ఆభరణాలను సుమారు 43మంది కస్టమర్ల ద్వారా తాకట్టు పెట్టుకున్న బ్యాంకు అధికారులు వారికి రుణాలు ఇవ్వడం జరిగింది. మూడేళ్ల కిందట బ్యాంకులో కుదువపెట్టిన వాటిని వేలం పెట్టేందుకు బ్యాంకు అధికారులు సిద్ధం కాగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మూడేళ్లుగా బ్యాంకు అధికారులు రెన్యూవల్ చేస్తున్నా నకిలీవని గుర్తించకపోవడం గమనార్హం. బ్యాంకులో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్, అప్రైజర్‌లు కలసి సదరు కస్టమర్లతో కుమ్మక్కైనట్లుగా ప్రచారం జరుగుతోంది. రుణాలు పొందిన కస్టమర్లు వాయిదాలతో పాటు అసలు కూడా చెల్లించకపోవడంతో ప్రస్తుత బ్యాంకు మేనేజర్ సమీర్‌కుమార్ వాయిదా ప్రకారం చెల్లించని వారి జాబితాను తయారు చేసి బంగారు ఆభరణాలను వేలం వేస్తున్నామని పత్రికా ప్రకటన ఇచ్చారు. ఈ క్రమంలో బంగారు ఆభరణాలు వేలం వేసేందుకు బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆభరణాల విలువ కట్టేందుకు సిద్ధమయ్యారు. అప్రైజర్ లేకపోవడంతో మేనేజర్ మరో వ్యక్తి ద్వారా బంగారు ఆభరణాల నాణ్యత విలువ చూసేందుకు బ్యాంకులో ఉన్న 350 ప్యాకింగ్ కవర్లను చెక్ చేయగా, సొమ్ము నకిలీగా తేలింది. ఈ కుంభకోణంలో అప్పటి అసిస్టెంట్ బ్యాంకు మేనేజర్ ఎల్లయ్య, అప్రైజర్ తంగళ్లపల్లి శ్రావణ్‌లు కలసి మరో నలుగురు వ్యక్తులు మధ్యవర్తులుగా నియమించుకొని 43మంది కస్టమర్ల పేరిట రూ.65,33,917 సొమ్మును కాజేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై బ్యాంకు మేనేజర్ శుక్రవారం మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.