అంతర్జాతీయం

బాల్యంలో గుండె జబ్బుంటే చెవిటితనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 16: నాలుగేళ్ల వయసులోగా హృద్రోగ శస్తచ్రికిత్స అవసరమయ్యే పిల్లలు అనంతర కాలంలో బధిరులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తాజా సర్వే స్పష్టం చేసింది. నాలుగేళ్లలోపు పిల్లలకు గుండె ఆపరేషన్ జరిగితే వాళ్లలో సాధారణంగానే చెముడు వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు తేల్చారు. చెముడుతోపాటు నత్తి, గ్రహణశక్తి లోపం, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుందని అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని పిల్లల ఆస్పత్రి పరిశోధకులు వెల్లడించారు. నాలుగేళ్ల వయసులోని గుండెకు సంబంధించిన సర్జరీ చేయించుకున్న 348 పిల్లల ఆరోగ్య పరిస్థితిని వీరు పరిశీలించారు. వీరిలో 21శాతం మందికి చెముడు ఉన్నట్టుగా తేల్చారు. 24 నెలల నుంచి 30 నెలలలోపు పిల్లలు గుండె ఆపరేషన్ చేయించుకుంటే ఈ రకమైన సమస్య నుంచి వారిని కాపాడే అవకాశం ఉంటుందని వెల్లడించారు.