వినదగు!

‘ఇహ’ ‘పర’ సమన్వయ సంయోగ సిద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మా! హృదయ క్షేత్రంలో ఉంటూ దేహాతీతంగా నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నావు. నీ ప్రయాణ పరిణామంతో మృత్యువుకు అతీతంగా, కాలానికి అతీతంగా ఈ మానవజన్మను మరుజన్మ లేకుండా పరిక్రమింప చెయ్యి.
-ఇదీ గిక సంకల్పం.. ఇదీ గిక లక్ష్యం.
* * *
ఈ దేహం శాశ్వతం కాద అని తెలుసు కాబట్టి నిత్య వనలం అనిపించుకోవాలని తాపత్రయపడుతుంటాం.. రంగులతో హరివిల్లులా తయారైనా విల్లులా వంగుతున్న దేహం మాత్రం వయసును ఎంతవరకు కప్పిపుచ్చగలదు?!
దేహమే కాదు.. ఈ పుటకా శాశ్వతం కాదు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా, ఎంతలా ధ్యాన మగ్నమైనా, ఎంతలా మహాత్ముల మనిపించుకున్నా ఏదో ఒకనాడు ఈ నిగనిగలాడే దేహం కరగాల్సిందే... మృత్యువును చేరవలసిందే!
మొత్తానికి ఈ రంగుల భౌతిక జీవనంలో పుట్టటం ఎంత సహజమో, బాల్యాన్ని దాటి కౌమారంలోకి, కౌమారం నుండి వనంలోకి.. అలా అలా జీవనయానం సాగిస్తూ సాగిస్తూ ఒకనాడు వృద్ధాప్యంలోకి అడుగుపెట్టవలసిందే... ఈ టర్నింగ్ పాయింట్‌లో దేహంపై ముడతలు చోటు చేసుకుంటున్నా, జుట్టు తెల్లబడుతున్నా ఎంతలా మేకప్ చేసుకున్నా ఆ మేకప్ సౌందర్యం మనసు గారడీనే! మేకప్ తీసేసిన మనసు ‘రొద’ను భరించటం ఎలా?
తాత్కాలికంగానైనా ఈ రొద ‘రోత’ అనిపించవచ్చు కాక.. ఈ వృద్ధాప్య వాస్తవాన్ని మభ్యపుచ్చలేము కదా. ఈ రొదతో మృత్యువును చేరే దిశలో అనారోగ్యం తప్పదు.. రోగాలతోపాటు ఈసడింపులూ తప్పవు. అవును, ఇంతేరా ఇంతేరా ఈ జీవితం.. ఈ తిరిగే రంగులరాట్నం.
అన్నట్టు, ఈ వర్ణ శోభితం ఎంతటి భ్రమాన్విత చక్రం అంటే స్వర్గాన్ని కోరుకుంటూనే చావు రాకుండా స్వర్గప్రాప్తి సాధ్యమయ్యేందుకు ద్వారాలు వెతుకుతుంది.. రోగం, చావు అన్నవి స్వభావాలు కావు ప్రకృతి సమాజాలు అన్న ఇంగిత జ్ఞానం కొరవడి. అసలు, ఈ జీవన యానంలో ప్రతీదీ విలువైనదే అని అనిపించటమే భౌతిక వాస్తవికతలా కనిపించే ప్రాపంచిక మాయ.. ఇంకా చెప్పుకోవాలంటే దేహభ్రాంతి.
ఎంతటి చదువు సంధ్యలు ఉన్నవారికైనా, ఎంతటి సంస్కారవంతులకైనా ఈ దేహ భ్రాంతి విషాదకారకమే. ప్రాపంచిక బంధాలు, ప్రాపంచిక సంపదలు విలువైనవిగా అనిపించటం, కనిపించటం ఎంత మోహకారకమో అంతే విషాదకారకం కూడా. ఈ దేహంలో చిక్కుకుని ఉన్నంతవరకు ‘వివేకం’ సైతం అప్పుడప్పుడూ తప్పటడుగులు వేస్తూనే ఉంటుంది.
అందుకే కృష్ణుడు-
‘మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖ దాః
ఆగమాపాయినో నిత్యాస్తాం స్తితిక్షస్వ...’
అని అంటున్నా జ్ఞానయోగి అయిన అర్జునుడు మాత్రం ప్రాపంచికతల నడుమ వివేకాన్ని కోల్పోయి విషాదానికి నెలవైనాడు. సన్నికర్షల విషయంలో సహనం లేక పరాక్రమం చూపవలసిన సమయంలో నీరుకారిపోయాడు.
ఇలా విచలితం కావటానికి కారణం మనం కానిదాన్ని, మనది కానిదాన్ని మనదే అని భ్రమించటం వల్లనే. అర్జునుడి కళ్ల ముందు కన్పిస్తున్న బంధుజనం యుద్ధం ముగిసిన తర్వాత కనిపించకపోవటం అన్నది ఎంత వాస్తవమో, ఆ కనిపించకపోయేది వారి దేహాలు, వారి రూపాలే తప్ప వారి ఆత్మ అస్తిత్వం కాదు అన్నది అంతే వాస్తవం. అయినా ఈ దేహ భ్రాంతి అర్జునుడ్ని వదలలేదు. కృష్ణుడికి-
‘అంతవంత ఇమే దేహా నిత్యస్సోక్తా శ్శరీరిణః
అనారినో ప్రమేయస్య తస్మాద్యుద్ధస్వ’
అని గీతోపదేశం చేయకా తప్పలేదు. ఆత్మ నిత్యమైంది, అవినాశి అంటూనే ప్రత్యక్ష ప్రమాణాలకు అందేది కాదు అనీ అనక తప్పలేదు.
‘అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః’
శోకింపదగని వారిని గురించి శోకిస్తున్నావు, పైగా ప్రజ్ఞావంతులు పలికే పలుకులు పలుకుతున్నావు అంటూ చిన్న చురకా వేయక తప్పలేదు.
ఇంతకీ కృష్ణుడు గీతోపదేశం ద్వారా తెలియజేసిన ఆత్మజ్ఞానం అంతకు ముందు అర్జునుడికి లేదా అంటే వలసినంత ఉంది.. కానీ బంధం భ్రాంతిగా పరిణమించి వివేక శూన్యున్ని చేసి విషాదభరితుడ్ని చేసింది. అవును, అర్జునుడు ఉక్కుమనిషే అయినా అతడి దేహం ఎముకల ప్రోవే, మాంసపు ముద్దనే, భావోద్వేగ నిలయమే.
అందుకే-
‘యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్’
కుల వినాశం వల్ల కలిగే దోషం, మిత్రద్రోహం వల్ల ప్రాప్తించే పాపం లోభులైన కౌరవులకు తెలియటంలేదు అని వాపోతాడు అర్జునుడు. బదులుగా ఇవన్నీ హృదయ దౌర్బల్యాలు అంటూ కృష్ణుడు కొట్టి పారేస్తూ గీతోపదేశం చేసింది ఆత్మ శాశ్వత ఆవాసం విశ్వవేదిక పైనే కానీ అశాశ్వతమైన ఈ దేహంలో కాదు అని స్పష్టం చేయటానికే. అందుకే భగవద్గీత అంటే ఆత్మజ్ఞాన పొత్తం అనే.. అది ఆత్మయోగ వేదిక. గీత ఒక్కొక్క శ్లోకం అర్థమవుతుంటే దైహిక శోకం తరగడమేకాక గికంగా సాధనావగ్నమవుతూ ఒక్కొక్క పర ప్రాంగణాలను గిక ప్రజ్ఞతో దాటతుంటాం. ఆ పరేంగిత ప్రజ్ఞకు భూమికనే భగవద్గీత.
* * *
ఆత్మ కొలువై ఉండేది హృదయ క్షేత్రంలో. ఆ హృదయంలో ఆత్మకు కావలసింది వెంట్రుకది పదివేల మందమయితే అందులో ఆత్మకు కావలసింది ఒక మందం మాత్రమే.. అదీ హృదయ మందిరంలో ఆత్మ అధివసించిన స్థానం. ఆత్మస్థానం అదే అయినప్పటికీ అరూపమే. అరూపం కాబట్టే ఆత్మ కరగదు, ఖండితం కాదు, ఆహుతి కాదు. నాశనం కాదు అనటం. అంటే, ఆత్మది అరూపమైన నిర్గుణ చైతన్యం. ఈ నిర్గుణత్వం అందివచ్చేది నిర్వికల్ప గిక సాధనతోనే. అంటే, ఆత్మ అస్తిత్వం అందేది గికత్వానికే తప్ప పాంచభౌతికానికి కాద. ఆత్మప్రజ్ఞ ఆవిష్కృతం అయ్యేది గిక ప్రజ్ఞనే.
ఫలతృష్ణ లేకపోవటం, కర్తృత్వ అహంకారం లేకపోవటం గిక ప్రజ్ఞకు తొలి వలి అడుగులు. ఈ అడుగు పడితేనే ఆత్మయోగం వాకిట నిలబడగలిగేది.
అన్నట్టు, యోగికి హృదయ క్షేత్రం అంటే మానవ అస్తిత్వ కేంద్రమే తప్ప మానవ దేహ కేంద్రం అని కాదు. ఇంకా చెప్పుకోవాలంటే యోగాగ్ని రాజుకునే క్షేత్రం. ఇలా యోగాగ్ని రాజిల్లటానికి భౌతిక, ప్రాపంచిక ఉపకరణాలేవీ పనికిరావు. నిజానికి, ఈ యోగాగ్ని నుండి ఎగసే మంట చైతన్య జ్వాలా తోరణమే. ఆ జ్వాలనే హృదయం నుండి ఉప్పొంగే చైతన్య స్రవంతి. ఈ ఆత్మ చైతన్యం స్రవంతిగా కాక విస్ఫోటనం కావటమే గికత్వం.. అదే గిక ప్రజ్ఞ.
జీవం ఉన్నంత వరకు ఈ జన్మ కొనసాగాల్సిందే.. అదీ జవసత్వాలన్న దైహిక ఆకర్షణతోనే. జవసత్వాలు ఉడుగుతుంటే దేహం ఆకర్షణను కోల్పోతుంది.. జీవం కోల్పోయి దేహం శవమవుతుంది.. అదే జీవచ్ఛవం. జీవచ్ఛవం కావటం అంటే బంధవిమోచనమే. మనం కాకపోయినా అంతకాలం మనవారు అనుకున్న వారందరూ బంధం తెంపుకుంటారు. అలా తెగిన బంధం జీవం కోల్పోయిన దేహానికి తెలియకపోవచ్చు కానీ దేహాతీతంగా అస్తిత్వాన్ని కలిగి ఉన్న ఆత్మకు మాత్రం అవగతమవుతుంది. ఒకసారి దేహాన్ని ఆశ్రయించిన ఆత్మ దేహాతీతంగా ఈ భౌతికానికి చెందిన మృత్యు రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత మళ్లీ దేహానికి అంటే జన్మకు రావాలనుకుంటుందా?
మళ్లీ జన్మ అనుకోవటం ఈ దేహభ్రాంతే తప్ప దేహాతీత వాస్తవం కాదు. సాధారణ జీవనంతో మరో జన్మకు ముడిపడుతుంటాం. అయితే యోగ సాధనతో ఈ భౌతిక జీవనంలోనే మరో జన్మ నుండి విడివడటానికి సమాయత్తమవుతాం.. ఆ ప్రయత్నమే, ప్రయోగమే యోగసాధన... ఆ జీవన ప్రయోగమే యోగం.
‘గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి’ అన్న కృష్ణుడి ప్రజ్ఞావాద అంతరార్థం ఇదే.
మొత్తానికి గిక ప్రయాణంలో దేహాన్ని అశ్రద్ధ చేయకూడదు. కారణం ఈ దేహమే ఆత్మ ప్రయాణానికి వాహనం కాబట్టి. ఇక్కడ వాహనం అంటే దేహంలో కూర్చుని విహరిస్తుందని కాని, ప్రయాణిస్తుందని కాని కాదు. యోగ సాధనతో జరిగే పరేంగిత ప్రయాణం అనునిత్యం జరిగేది ఈ దేహం నుండే. యోగసాధనలో ఆత్మ ఈ దేహం నుండే పర ప్రాంగణాలకు పయనమవుతుండాలి. పరప్రాంగణాల అనుభవాలను, అనుభూతులను మూటగట్టుకుని ఈ దేహానే్న చేరుతుంది. అంటే, గిక ప్రజ్ఞగా పరిఢవిల్లే ఆత్మ ప్రజ్ఞకు ఈ దేహవే ఒక రక్షక నిలయం అన్నమాట.
అన్నట్టు, గిక ప్రజ్ఞామార్తులకు తన దేహమైనా, ఇతరుల దేహమైనా ఒక్కటే.. ‘నా’ ‘నీ’ దేహాలు వేరువేరు కాదు. ‘స్వ’ ‘పర’ దేహ సమన్వయ సాధనే గిక సంయోగం. ఇంతకీ ఆ ‘పరం’ ఇహానికి చెందిన మరో దేహ రూపం కావొచ్చు లేదా పాంచభౌతికాన్ని వీడి పరంగా రూపుదిద్దుకున్న అరూపం కావొచ్చు. ఈ ‘స్వ’ ‘పర’ దేహాల, ఈ ‘ఇహ’ ‘పర’ ఆత్మల సంయోగ వేదికనే మన ఈ మానవ జన్మ.
‘ప్రయాణకాలే మనసాచలేన భక్త్యయుక్తో యోగబలేన చైవ’

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946