రాష్ట్రీయం

నేడు కేబినెట్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సుదీర్ఘ భేటీకి సిద్ధమవుతోంది. విజయవాడలో సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలకాంశాలపై చర్చించనున్నారు. సమావేశంలో మంత్రుల పనితీరునూ సిఎం సమీక్షించి హెచ్చరికలు జారీచేసే అవకాశం ఉందని సమాచారం. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ కుటుంబీకులను పరామర్శించే విషయంలో మంత్రులు వేగంగా స్పందించకపోవడంపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. నాలుగు రోజుల దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఆదివారం పొద్దుపోయిన తర్వాత విజయవాడకు చేరుకున్నారు. అంతకుముందు దావోస్ నుంచి నేరుగా సింగపూర్‌కు వెళ్లి అక్కడ అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ముందుకు వచ్చిన కంపెనీలతో చర్చించారు. అక్కడ నుంచి విజయవాడకు చేరుకుంటారు. దావోస్‌లో తాను వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో నెరపిన చర్చలు, సాధించిన పెట్టుబడుల అంశాలను కేబినెట్‌కు వివరించనున్నారు. కాపులకు రిజర్వేషన్ల అంశం, ఆ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు చట్టపరిధిలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈసారి ఎక్కడ నిర్వహించాలనే దానిపైనా చర్చ జరుగనుంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో పాటు తెదేపా ఎమ్మెల్యేలు విజయవాడలోనే సరిపడా వౌలిక వసతి సదుపాయాలున్న భవనంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం మంచిదనే ఆలోచనలో ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు మొదటి నుంచి మొగ్గుచూపుతున్నారు. ఈ విషయమై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి 1వ తేదీ నుంచి నిర్వహించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ విషయమై కూడా మంత్రుల అభిప్రాయాలను సేకరించనున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న ఆర్ధిక అనిశ్చిత పరిస్ధితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, 15వేల కోట్ల రూపాయలకు పైగా కనపడుతున్న లోటు, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ సిఫార్సు మేరకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.12వేల కోట్ల నిధులు అంశాలపై కూలంకషంగా చర్చించనున్నారు. కాగా ఏపి డిస్కాంలు రూ.783 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచాలని కోరుతూ ఏపిఇఆర్‌సికి ప్రతిపాదనలు ఇచ్చారు. దీనిపై బహిరంగ విచారణ జరిగిన తర్వాత ఏపిఇఆర్‌సి నిర్ణయం ప్రకటిస్తుంది. రూ.5700 కోట్ల లోటుతో ఉన్న డిస్కాంలను ఆదుకునేందుకు ప్రభుత్వం 4 వేల కోట్ల రూపాయల మేర సబ్సిడీ భారాన్ని పెంచాల్సి ఉంది. ఈ మంత్రివర్గ సమావేశంలో సబ్సిడీ భారం భరించే విషయమై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అమరావతి వద్ద వెలగపూడిలో సచివాలయం నిర్మాణం, నిధుల కేటాయింపు, స్ధానికత అంశంపై రాష్టప్రతి ఆర్డర్‌కు సవరణలు చేసేందుకు కేంద్ర హోంశాఖ సుముఖత వ్యక్తం చేయడం తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. విజయవాడ నగరంతో రాష్టమ్రంతటా ప్రకంపనలు సృష్టించిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో నిందితులకు బెయిల్‌రావడం కోర్టు పరిధిలో అంశమైనా, రాష్ట్రప్రభుత్వం సీరియస్‌గా లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇంతవరకు తీసుకున్న చర్యలను వివరించాలని ఇప్పటికే డిజిపిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.