మెదక్

నేతాజీపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జనవరి 25: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిలుపుమేరకు సోమవారం ఎఐసిసి అధికార ప్రతినిధి ఆనంద్‌శర్మ దిష్టిబొమ్మను జిల్లాకేంద్రంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ హరికాంత్‌రెడ్డి మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రకు సంబంధించిన ఫైల్స్‌ను ప్రభుత్వం ఈ తరానికి అందించడాన్ని ఎబివిపి హర్షిస్తుందన్నారు. నేతాజీ అదృశ్యం అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విధానాలను కాంగ్రెస్ విమర్శించడాన్ని తప్పుపాట్టారు. దేశభక్తుడైన బోస్ మరణం మిస్టరీ ఫైల్స్‌ను బహిర్గతం చేస్తున్న తరుణంలో ప్రధాని నెహ్రూ పాత్ర ఎక్కడ భయటపడుతుందో అన్న భయంతోనే కాంగ్రెస్, ఆనంద్‌శర్మ తదితరులు కేంద్ర ప్రభుత్వంపై అనుచిత వాఖ్యలు చేశారన్నారు. రాహుల్, సోనియాగాంధీలు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర సంగ్రామంలోను ఎందరో మహనీయుల చరిత్రను కాంగ్రెస్ అవమానించిందన్నారు. కుటిల రాజకీయాలను మానుకొని నేతాజీకి నివాళులు అర్పించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెహ్రు, అశోక్, నరేష్, హరీష్‌రెడ్డి, శ్రీశైలం, శివ తదితరులు ఉన్నారు.

ఎంత మెజార్టీ వస్తే అంత అభివృద్ధి

ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, జనవరి 25: అభివృద్ధిలో అట్టడుగున ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజల్లో నాలుగు నెలల్లోనే చైతన్యం వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఆలోచన రావడం సంతోషకరమని మంత్రి హరీష్‌రావు అన్నారు. జరగనున్న ఉప ఎన్నిక సందర్భంగా టిఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చిన జనంతోటే గెలుపు ఖాయమైందని, మిగిలింది ఎంత మెజార్టీ సాధిస్తామన్నదేనని, అభ్యర్థి భూపాల్‌రెడ్డికి ఎంత మెజార్టీ తీసుకువస్తామా అన్న భారాన్ని వేసుకుని ఎక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చేలా చూడాలని పిలుపునిచ్చారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ముందుగా రహమాన్ పంక్షన్ హాల్ వద్ద నిర్వహించిన సభలో కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. అభివృద్ధిలో వెనుకబడిన నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని మరో సిద్దిపేటగా రూపురేఖలు మార్చాలంటే కోట్లాది రూపాయల నిధులు అవసరం పడుతాయన్నారు. సిఎం కెసిఆర్ కోట్ల నిధులు ఇవ్వాలంటే జరగనున్న ఉప ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు ఓట్లు కురిపించాలంటూ చమత్కరించారు. దశాబ్దాల కాలంగా ప్రతి సంవత్సరం ఈ ప్రాంత ప్రజలు తాగునీటి కోసం తల్లడిల్లుతుంటారని, మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఆడపడుచుకూడా బిందెపట్టుకుని రోడ్డుపై తిరగకూడదన్న లక్ష్యంతో సిఎం కెసిఆర్ మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. గోదావరి జలాలను సింగూర్‌కు తీసుకువచ్చి అక్కడి నుంచి నారాయణఖేడ్ నియోజకవర్గానికి తరలించి దాహర్తి అనే పదాన్ని పారద్రోలుతామన్నారు. 60 ఎళ్ల పాలనలో లేని అభివృద్ధిని తాము నాలుగు నెలల్లోనే అభివృద్ధి చేసి చూపించామన్నారు. సబ్ స్టేషన్లు, కులాల వారిగా కమ్యూనిటి భవనాలు, టిఎన్‌జివో భవనం, విశ్రాంత ఉద్యోగుల భవనం, రైతాంగాభివృద్ధి కోసం మిషన్ కాకతీయ ద్వారా అనేక చెరువులు అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. దళిత, గిరిజనులకు కల్యాణ లక్ష్మీ, మైనార్టీలకు షాదీముభారక్, భూమి లేని దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకం, రెండు గదులతో కూడిన ఇళ్లు, ఆసరా పింఛన్లు, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ గృహాల విద్యార్థులకు సన్న బియ్యం భోజనం, దీపం కనెక్షన్లు, డ్వాక్రా రుణాలు, రైతు రుణమాఫీ, రోడ్ల మరమ్మతులు తదితర ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రజల కోసం అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ అని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలన్నారు. మరో రెండు నెలల్లో పగటి పూట 9 గంటల విద్యుత్‌ను వ్యవసాయ రంగానికి అందించబోతున్నట్లు తెలిపారు. 500 జనాభ కలిగిన ప్రతి గిరిజన తండాను గ్రామ పంచాయతీగా మార్చబోతున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు చేసే దుష్ప్రచారాన్ని నమ్మకుండా ప్రజాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న సిఎం కెసిఆర్ కోసం ఖేడ్ ఓటర్లు భారీ మెజార్టీ అభ్యర్థి భూపాల్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపి బిబి పాటిల్, జడ్పీ చైర్మన్ రాజమణి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబుమోహన్, మదన్‌రెడ్డి, రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డిలతో పాటు టిఆర్‌ఎస్ అభ్యర్థి ఎం.్భపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థులకు
బ్రహ్మరథం
డిసిసి అధ్యక్షురాలు సునితా రెడ్డి
రామచంద్రాపురం, జనవరి 25: జిఎచ్‌ఎంసి ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు వాకిట సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ పాలనపై విసిగి వేసారిన మహానగరవాసులు కాంగ్రెస్‌కు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేసారు. సోమవారం ఆమె మెదక్ జిల్లా పరిధిలోని రామచంద్రాపురం భారతినగర్‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి అవినాష్‌గౌడ్‌తో కలిసి ఆమె పట్టణంలో విసృతంగా పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం 19 మాసాలలోనే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటుందని విమర్శించారు. గ్రేటర్ హైద్రాబాద్ మహానగర ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటితో విజయఢంకా మోగిస్తారని జోస్యం పలికారు. ఎట్టి పరిస్థితులోను జిఎచ్‌ఎంసి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవలం చేసుకుంటుందన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి విజయం అందించడం ద్వార మహానగర ఓటర్లు అధికార పార్టీకి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని పార్టీ జిల్లా అధ్యక్షురాలు వాకిట సునీతా లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. వంద సీట్లను గెలుచుకుని సత్తా చాటుతామని ప్రగల్భాలు పలుకుతున్న టిఆర్‌ఎస్ అధినాయకులకు ఫిబ్రవరి ఐదున వాస్తవం వెలుగు చూస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిఎచ్‌ఎంసిగా మారిన హైద్రాబాద్ అనేక రంగాలలో అభివృద్ధి వైపుపరుగులు తీసిందన్నారు. నగర ప్రజలు అనునిత్యం అనుభవిస్తున్న ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఔటర్ రింగ్ రోడ్డు ఈరోజు బాగా ఉపయోగపడుతుందని ఆమె ఈ సంధర్బముగా గుర్తుచేసారు. సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు, అమీన్‌పూర్ సర్పంచ్ కాట శ్రీనివాస్‌గౌడ్ సతీమణి ఎంపిటిసి కాట సుధారాణి ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభ్యర్థి విజయం కోసం ఓటర్లను అభ్యర్థించారు.

పతాకస్థాయికి చేరిన ప్రచారం

పటన్‌చెరు, జనవరి 25: జిఎచ్‌ఎంసి ఎన్నికల ప్రచారం సోమవారానికి పతాకస్థాయికి చేరుకుంది. ఇంకా ఎన్నికల జరగడానికి వారం రోజుల గడువు ఉన్నప్పటికీ ప్రధాన పార్టీల అభ్యర్థులు కాలనీలలో ముమ్మరంగా పర్యటనలు జరుపుతూ సందడి చేస్తున్నారు. కాంగ్రెస్, టిడిపి, బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీలకు చెందిన నాయకులు తమ అభ్యర్థులను ఎలాగైనా గట్టెక్కించాలని ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంకర్‌యాదవ్ సోమవారం గౌతంనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించగా బిజెపి అభ్యర్థి దేవేందర్‌రాజు రాఘవేంద్రనగర్‌కాలనీలో ఇంటింటి ప్రచారం చేసారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి కుమార్‌యాదవ్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి తదితరులతో కలిసి మహాత్మగాంధి రోడ్‌లో పాదయాత్ర జరిపారు. టిడిపి అభ్యర్థి మెట్టుకుమార్‌యాదవ్ కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు విజయరామారావులతో కలిసి శిశుమందిర్‌కాలనీ, జెపికాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్బముగా కాంగ్రెస్ అభ్యర్థి శంకర్‌యాదవ్ మాట్లాడుతూ జిఎచ్‌ఎంసిలో కలిసిన తరువాత పటన్‌చెరు పట్టణం మురికి కూపంగా మారిందన్నారు. ఎక్కడబడితే అక్కడ చెత్త దర్శనమిస్తోందని ఆవేదన వెలుబుచ్చారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ పూర్తిగా పాడైపోయిందని సంబంధిత అధికారులు గాని, సిబ్బందిగాని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తనకు కార్పొరేటర్‌గా అవకాశం ఇచ్చినట్లైయితే కేవలం ఆరు మాసాల కాల వ్యవధిలో పట్టణ రూపురేఖలు మార్చుతానని హామి ఇచ్చారు. అదికారం ఉన్నప్పటికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రేటర్ హైద్రాబాద్‌ను ఏమాత్రం బాగు చేయలేదన్నారు. టిడిపి అభ్యర్థి మెట్టుకుమార్ మాట్లాడుతూ టిడిపి హయాంలో భాగ్యనగరానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చిందనే విషయం ప్రజలు గుర్తెరగాలన్నారు. ఐటి రంగంలో హైద్రాబాద్‌ను భారతదేశంలోనే మేటిగా నిలిపిన ఘనత కేవలం టిడిపి అధినేత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. బిజెపి అభ్యర్థి దేవెందర్‌రాజు మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో అధికార పార్టీ వెనుకబడిందన్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానన్నారు. అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థి రాజబోయిన కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతో పట్టణంలో ప్రజలకు అవసరమైన వౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

చిరు ఉద్యోగి తప్పిదంతో..
అధికారుల మెడకు ఉచ్చు!
వ్యవసాయ శాఖ కుంభకోణంలో ఏడుగురు ఉద్యోగుల బలి
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, జనవరి 25: నమ్మించి గొంతు కోయడం అంటే ఏమిటో వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన కుమ్మరి మాణయ్య ద్వారా స్పష్టమైంది. ఇదే విషయం కలెక్టరేట్‌లో చర్చనీయాంశంగా మారింది. అందరితో నమ్మకంగా మెదిలిన ఆపరేటర్ మాణయ్య మొత్తం శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల వద్ద విశ్వాసాన్ని పెంచుకున్నాడు. వ్యవసాయ శాఖలో పని చేస్తున్న సీనియర్ ఉద్యోగులు మాణయ్యపై పెంచుకున్న నమ్మకంతో శాఖకు సంబంధించిన చెక్కు బుక్కులతోపాటు వ్యక్తిగత అకౌంట్ల లావాదేవీలను సైతం నిర్వహింపజేస్తారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కంప్యూటర్ పరిజ్ఞానంపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో అధికారులు పూర్తిగా ఆధారపడ్డారన్న ఆరోపణలున్నాయి. జెడికి తెలియకుండానే కొంతమంది ఉద్యోగులు మాణయ్య ద్వారా శాఖకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను సైతం నిర్వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు మాణయ్యకు లండన్ నుంచి వచ్చిన మెస్సేజ్ ద్వారా 7 కోట్లు దక్కించుకోవాలన్న దుర్బుద్ధితో తనకు అవసరం ఉన్న కోటి రూపాయలకు ఎక్కువగా తస్కరించడానికి పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించుకున్నట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. చెక్కులను తస్కరించడంతో పాటు ప్రొసీడింగ్స్‌ను తయారు చేసుకుని ఫోర్జరీ సంతకాలతో 15 రోజుల వ్యవధిలో 23 చెక్కులు, 3.13 కోట్ల నిధులను ఆయా సంస్థలు, వ్యక్తుల పేర్లపైకి దారి మళ్లించాడు. అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావడంతో పెద్ద కుంభకోణం వెలుగు చూసింది. వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు అప్రమత్తం కావడంతో వెనువెంటనే విచారణ కమిటీని నియమించి శాఖాపరమైన విచారణ చేపట్టారు. చిరుఉద్యోగి ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడినా బాధ్యతగల అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఉన్నతాధికారులు తీవ్రస్థాయిలో మందలించినట్లు తెలుస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీనియర్ అసిస్టెంట్లను స్కాం వెలుగు చూసిన రోజునే సస్పెండ్ చేయగా, సోమవారం నాడు వ్యవసాయ శాఖ డైరెక్టర్ సి.పార్థసారథి జిల్లా వ్యవసాయ శాఖలో పని చేస్తున్న బి.శ్రీనివాస్ సూపరింటెండెంట్, క్రిష్ణారావు సూపరింటెండెంట్, జి.రమేష్ సాంకేతిక విభాగం ఎఓ, కె.పద్మ ఎడిఎ, హుక్యా నాయక్ జాయింట్ డైరెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెల్లడించారు. ఉద్యోగ భద్రత లేని కంప్యూటర్ ఆపరేటర్ చేసిన పాపానికి మొత్తం ఏడుగురు పర్మనెంట్ ఉద్యోగులు సస్పెండ్ కావడం గమనార్హం.

ఓటు హక్కు వినియోగంపై అవగాహనతో మెలగాలి
* ఎస్పీ సుమతి
సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 25: ఓటు హక్కు వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహాన కలిగి ఉండాల్సిన బాధ్యత యువతపై ఉందని ఎస్పీ సుమతి పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం 6వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగం, ఎందుకు ఓటు వేయాలి వంటి విషయాలపై అవగాహాన పెంచాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. తప్పకుండ ఓటు హక్కు వినియోగించుకునే బాధ్యత యువతపైనే ఉందన్నారు. జనాభాలో అధికంగా ఉన్న యువత తలుచుకుంటే దేశ ప్రగతి మారుతుందన్నారు. ప్రభుత్వమే చేయాలని ఎదిరి చూడకుండ సమాజంలోని పౌరులుగా బాధ్యతలను తెలుసుకొని నడుచుకోవాలన్నారు. సరైన వ్యక్తులను వారి అభిష్టం మేరకు ఎన్నుకునేందుకు ఒక బలమైన సాధనంగా ఓటును భావించాలన్నారు. జెసి వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరు తప్పక ఓటు వేయాలన్నారు. భారత ప్రజాస్వామ్యానికి ఓటింగ్ విధానం ఎంతో ప్రాధాన్యాతను సంతరించిపెట్టిందని ప్రజలు ఆశించే ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ఎన్నిక కావడానికి ఓటు హక్కు ద్వారా సాధ్యమవుతుందన్నారు. మనదేశం ఇంకా ఆన్‌లైన్ ఓటింగ్ విధానంలోకి రాలేదని, ఫలితంగా ఇష్టం వచ్చిన వారిని, సమర్థులు అని భావించిన వారిని ఎన్నుకునే ఫెసులు బాటు ఓటు ద్వారా కలుగుతుందన్నారు. జడ్పీ సిఈఓ వర్షిణి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా జెసి వెంకట్రామ్‌రెడ్డి అధికారులు, ఉద్యోగులు, విద్యార్థుల ద్వారా ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఎన్నికల్లో పాల్గొని నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించి, సీనియర్ సిటిజన్స్‌ను సన్మానించారు. అంతకు ముందు స్థానిక ఐబి అతిధి గృహం నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ఓటరు దినోత్సవ ర్యాలీని జిల్లా జడ్జి ఎంవి రమణనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కృష్ణ ఆదిత్య, డిఆర్వో దయానంద్, డిఆర్‌డిఎ పిడి సత్యనారాయణరెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ చక్రవర్తి, ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, వాఖ్యతగా తెలుగు ఉపాన్యసకులు కృష్ణ, ఆర్‌ఐఓ కిషన్ నాయక్, వివిధ కళాశాలల విద్యార్థులు, అద్యాపకులు పాల్గొన్నారు.

ఘకిడ్నాప్ కేసు ఛేదనకు ప్రత్యేక బృందం
* సమాచారం తెలిపిన వారికి రూ.50వేల నగదు బహుమతి
* సిసిఎస్ సిఐ క్రిష్ణయ్య
సంగారెడ్డి టౌన్, జనవరి 25: బాలుడి కిడ్నాప్ కేసును చేదించేందుకు జిల్లా ఎస్పీ సుమతి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సిసిఎస్) సిఐ కిష్ణయ్య తెలిపారు. సోమవారం సిసిఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత యేడాది నవంబర్ 22న రామచంద్రాపురం మండలం బీరంగూడలోని డ్వారిన్ పాఠశాల ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారి పృధ్వీనారాయణసింగ్ కిడ్నాప్‌నకు గురైనాడు. గత మూడు రోజులుగా బాలుడి ఆచూకి కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. డార్విన్ పాఠశాలలోనే పృధ్వీ నారాయణ తల్లిదండ్రులు పని చేస్తుండడంతో సెలువు దినమైన 22న పాఠశాల విధులకు హాజరైనారు. పాఠశాల ప్రాంగణంలో ఆడుకుంటున్న బాలుడు కిడ్నాప్‌కు గురైనాడు. విద్యార్థి ఆచూకీ తెలిపిన వారికి రూ.50వేల నగదు బహుమతి ప్రకటించారు. సమాచారం తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9490617006, 9490617042, 9493014855 నంబర్లకు సమాచారం అందిచాలని సిసిఎస్ సిఐ క్రిష్ణయ్య కోరారు.

నిర్ణయించిన ధరలు
చెల్లించాల్సిందే
సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 25: జహీరబాద్‌లోని ట్రైడెంట్ చక్కర పరిశ్రమ గత యేడాది నిర్ణయించిన చెరుకు టన్ను ధర 2663 రూపాయలను చెల్లించాలని, ఈ విషయంపై ఈ నెల 30లోగా నిర్ణయం తెలిజేయాలని జాయింట్ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పరిశ్రమ అధికారులు, రైతు ప్రతినిధులతో సమావేశమైనారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలోని మిగిలిన చెక్కర పరిశ్రమల యాజమాన్యాలు నిర్ణయించిన ధర రూ.2663 చెల్లిస్తుండగా కేవలం ట్రైడెంట్ యాజమాన్యం రూ.2440 చెల్లిస్తుందన్నారు. గతంలో నిర్ణయించిన ధరను రైతులకు చెల్లించాల్సిందేనని, ఈ నెల 30లోగా నిర్వహించే సమావేశంలో నిర్ణయం వెల్లడించాలని ఆదేశించారు. పరిశ్రమ లాభ నష్టాలతో తమకు సంబంధం లేదని రైతుల ఇబ్బందులను ప్రభుత్వ పరంగా పరిష్కరించడమే ముఖ్యమన్నారు. నిర్ణయించిన ధరను చెల్లించడానికి ముందుకు వస్తే ఇతర పరిశ్రమలకు చెరుకును తరలించకుండ రెవెన్యూ అధికారుల ద్వారా పర్యవేక్షించి సహకరిస్తామన్నారు. లేని పక్షంలో రెవెన్యూ అధికారులతో ఇతర ఫ్యాక్టరీలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. గత యేడాది కి సంబంధించిన 6.23కోట్ల బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని ఇకపై 15రోజులకు ఒక సారి సమీక్షలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఫ్యాక్టరి ప్రతినిధులు ఎం.కృష్ణన్, జిఎం మనోజ్‌గోయాల్, కేన్ మేనేజర్ రామారావు, సహాయ కమీషనర్ రవీందర్‌రావు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు
ఎన్నికల సంఘం అవార్డు
సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 25: భారత ఎన్నికల సంఘం నుంచి ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ అవార్డును అందుకున్నారు. లోగాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ చేతుల మీదుగా అవార్డు పొందారు. అవార్డు కింద రూ.25వేల చెక్కు, మెమోంటో, సర్ట్ఫికేట్‌ను అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో పని చేసే సమయంలో ఓటర్ల జాబితాకు ఆధార్ సీడింగ్, ఓటర్ అవగాహన కార్యక్రమాల నిర్వహణ, ఎన్నికలకు సంబంధించి తీసుకున్న చర్యలకు ఈ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు
సంగారెడ్డి టౌన్, జనవరి 25: ప్రభుత్వ విధానాల వల్లే తెలంగాణ రాష్ట్రంలో 1830మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బొంతల చంద్రారెడ్డి అన్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో రుణాలు -అప్పులు - రైతు ఆత్మహత్యలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. సెమినార్‌కు ముఖ్య అతిధిగా హాజరైన చంద్రారెడ్డి మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ ఫైనాన్స్‌లపై ఆధారపడి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం 2012-13లో 39,510 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 15,204 కోట్లు మాత్రమే ఇచ్చారని, 2014-15లో 51,468 కోట్లకు 27,276 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. 2015-16 ఖరీఫ్‌లో 18,032కోట్లకు గాను 6029 కోట్లు మాత్రమే ఇచ్చారని, ఇందులో 25శాతం కూడా దాటడం లేదన్నారు. గత్యంతరం లేక 85శాతం మంది రైతులు ప్రైవేట్ ఫైనాన్స్‌లపై ఆధారపడి, వడ్డీలు పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి దారులకు 5.25లక్షల కోట్ల రాయితీలు, 3లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టిన ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రాష్ట్రంటలో 362 కరువు మండలాలకు 231 మండలాలు ప్రకటించి చేతులు దులుపుకుందని విమర్శించారు. 6వేల కోట్ల కరువు నష్టపరిహారాన్ని వెంటనే రైతులకు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సెమినార్‌లో రైతు సంఘం జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు కె.రాజయ్య, జయరాజ్, నాయకులు శ్రీనివాస్, నర్సింహారెడ్డి, మల్లారెడ్డి, బాలయ్య, దేవయ్య, వీరయ్య, కృష్ణ, పాండు, మల్లయ్య, లచ్చాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.