రాష్ట్రీయం

నక్సల్స్ దంపతుల ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జనవరి 25: మావోయిస్టు పార్టీకి ఒడిశా రాష్ట్రంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దియోఘర్ జిల్లా అడవుల్లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాష్ట్ర పార్టీ కమిటీ సభ్యుడు, కళింగ డివిజన్ కార్యదర్శి పుట్టపాక కుమారస్వామి అలియాస్ సుశీల్ అలియాస్ బసంత్ అలియాస్ రంజిత్ అలియాస్ వీరన్న, అతని భార్య సింద్రీ లింగో అలియాస్ సోనీ అలియాస్ రోమా హతమయ్యారు. పుట్టపాక కుమారస్వామిది తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా కాగా, అతని భార్య సింద్రీ లింగోది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా. భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరు మరణించినట్టు ఒడిశా పోలీసులు ప్రకటించారు. ఎన్‌కౌంటర్ జరిగిన దియోఘర్ జిల్లా ఒడిశాలోని తూర్పు ప్రాంతంలో ఉంది. ఇదిలావుంటే, భద్రాచలం మన్యంలో ఆరుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసినట్టు ఏఎస్పీ భాస్కరన్ తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ చర్ల మండలం చింతగుప్ప అటవీ ప్రాంతంలో జిల్లా స్పెషల్ పార్టీ, 141 సిఆర్‌పిఎఫ్ జవాన్లు, వెంకటాపురం సర్కిల్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిని ప్రశ్నించగా మిలీషియా సభ్యులుగా వెల్లడించారని, దీంతో వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎఎస్పీ వివరించారు.