అక్షర

నాణానికి ఇరువైపులా బాలి ‘చిత్ర’ జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలి ‘చిత్ర’మైన జీవితం
వెల: రూ.150/-
ప్రతులకు:
‘బాలి’
ఎమ్.శంకరరావు
ప్లాట్ నెం.1బి 83
హౌస్ నెంబర్ 2-8-18
సెక్టర్-9, ఎమ్.వి.పి.కాలనీ
విశాఖపట్నం- 530017
సెల్: 9849963082

వేదగిరి కమ్యూనికేషన్స్‌వారు ప్రచురించిన అనేకానేక ప్రసిద్ధ ప్రచురణల్లో ‘చిత్రం’గా వెలువడిన మరో కొత్త గ్రంథం ‘‘బాలి చిత్రమైన జీవితం’’-
ఆమూలాగ్రం చదివించే పట్టుతో రాసిన ఆత్మకథలాంటిది-
నిజాల్ని నిస్సంకోచంగా వెలువరించడం ఆత్మకథ పరమార్థం.
సత్యమే- వారి జీవనయానంలో తారసపడ్డ సంఘటనలు, పరిచయమైన వ్యక్తులూ... పడి లేచిన.... నడుస్తూ పడిన సందర్భాలూ... తప్పులూ, ఒప్పులూ, తొట్రుపడిన పరిస్థితిలో అనుభవాలు నేర్పిన పాఠాలూ... అన్నీ నవ సమాజానికి స్ఫూర్తినీ.. హెచ్చరికనీ కూడా కలిగించే లక్ష్యం ఆత్మకథా రచన ప్రత్యేకత!
ఇది రచయిత భావజాలం కాదు- సమాజాన్ని ఆ వ్యక్తి చూసిన దృక్పథం! తన ఒడిదుడుకుల జీవన పథంలో తారసపడిన అనుభవాల సారాంశం!
అయితే సరే... రచయిత ‘బాలి’ముందుమాటల్లో స్వయంగా చెప్పుకున్నట్లు... ‘‘ఎవరైనా వ్యక్తుల వ్యక్తిత్వంలో నాణేనికి రెండు పక్కలా చూపించాలన్నదే నా ధ్యేయం- పరనింద, ఆత్మస్తుతి లాంటివి ఈ రచనలో ఎదురుపడ్డాయని పాఠకులు భ్రమిస్తే.. అది వారి సంస్కారానికే వదిలేయదల్చాను.’’అని ముందరే హెచ్చరించిన వీరి ప్రజ్ఞ... సమకాలీన తరంలో ప్రసిద్ధుల ‘రెండోవైపు చూపించడంలో’ ఉన్న లక్ష్యంలో ‘ఆత్మస్తుతి’ పెద్ద ఎక్కువగా కనిపించలేదు-
పరనింద అని వారు ప్రకటించిన విషయంలో చాలామంది ‘సంస్కారవంతులు’ నొచ్చుకుంటారు. మనమధ్య నేడు లేని ‘తెలుగుజాతి ప్రముఖులు’ వారివారి అనుయాయులు ఈ పుస్తకం చదివి వారి వారి సంస్కారాన్నిబట్టి స్పందిస్తారని ఆశిద్దాం! అయితే.. రచయిత మనోవికాసం, విచక్షణ రచనల్లో కలిపించాలి గానీ పాఠకుల ‘సంస్కారం’పై రచయితలు ఆధారపడకూడదని ప్రవచించిన ప్రముఖ విశే్లషకులు ‘మన్మన్’ గారి అభిప్రాయాన్ని మనం ఇక్కడొక్కసారి తల్చుకోవడం అసందర్భం కాదేమో....

-బి.ఎస్.శర్మ