రాష్ట్రీయం

ఎన్జీవోలే సారథులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 12: మిగిలిన జిల్లా కేంద్రాలతో సమానంగా శ్రీకాకుళం, మచిలీపట్నం, చిత్తూరుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యాన్ని (హెచ్‌ఆర్‌ఎ) పెంచుతున్నట్టు సిఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ మూడు ప్రాంతాల్లో ప్రస్తుతం 14.5 శాతమున్న హెచ్‌ఆర్‌ఎను 20శాతం చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే మహిళా ఉద్యోగులకు చైల్డ్‌కేర్ సెలవును 60 రోజుల ముందునుంచే ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. భవిష్యత్‌లో కేంద్రం మంజూరు చేసేవిధంగా రెండేళ్ల వరకూ పెంచుతామని హామీ ఇచ్చారు. శుక్రవారం రాత్రి శ్రీకాకుళం సమీపంలోని ఎచ్చెర్లలోని శివానీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏపీ ఎన్జీవోల 19వ రాష్ట్ర మహాసభలకు ముఖ్యఅతిధిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ రానున్న బడ్జెట్ రూపకల్పనలో ఏపీ ఎన్జీవోలు భాగస్వాములు కావాలని కోరారు. విలువైన సూచనలు, సలహాలిస్తే పరిశీలించి, అవసరమైనవి పరిగణనలోకి తీసుకుంటామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను అంచెలంచెలుగా రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మానవతా దృక్పథంతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు ప్రైవేటు సంస్థల్లో ఇచ్చే కనీస వేతనస్థాయిలో ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఆర్థిక వెసులుబాటు ఉంటే వెనక్కి తగ్గేపనేలేదని, లోటుబడ్జెట్‌లో పరిపాలన నడిపిస్తున్న విషయం తెలిసిన ఉద్యోగులంతా సహకరించాలని కోరారు. ఉద్యోగుల సర్వీసు, పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చేందుకు అన్ని శాఖలకు కమిటీలు వేస్తామన్నారు. రెండు రోజుల ఎన్జీవోల మేధోమథనం సదస్సు రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించడం సంతోషమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించి ప్రజలనాడికి నడకనేర్పిన ఎన్జీవోలు అవినీతిరహిత ఆంధ్రగా తీర్చిదిద్దేందుకు పూర్తి సహకారం అందించాలని కోరారు. విజయవాడలో సిఎం, హైదరాబాద్‌లో సిఎస్ ఉంటూ పాలన సాగించటం ఎంతకష్టమో ఉద్యోగులందరికీ తెలిసిందేనన్నారు. విభజనలో ఆదాయం 46శాతం మాత్రమే ఏపీకి దక్కడం, 14వ ఆర్థిక సంఘం నివేదికల్లో ఆదాయం తక్కువగల రాష్ట్రంగా హెచ్చరించిన సమయంలోనూ ఉద్యోగుల గౌరవం కాపాడాలన్న ఉద్దేశ్యంతో 40శాతం పిఆర్‌సి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసారు. ఈ ఏడాది జనవరి 16నుంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ అమలయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్జీవోల త్యాగాలకు ఫలితంగా కేసులు ఎత్తివేసి, సమ్మెకాలానికి జీతభత్యాలు ఇచ్చామన్నారు. 60 ఏళ్లకు పదవీ విరమణ కాలపరిమితి పెంచి, బదిలీలు ఆరేళ్ల నుంచి తొమ్మిదేళ్లకు పెంచామన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు భరోసా కల్పించేందుకు మరిన్ని నిర్ణయాలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఐఎఫ్‌ఆర్‌లో బాగా పనిచేసిన ఉద్యోగులందరినీ అభినందించారు. 2020నాటికి ఏపీని అగ్రరాష్ట్రంగా తీర్చిదిద్దాలని, విభజన వల్ల కలిగే ఇబ్బందులు కలిగించే వారంతా తలదించుకునేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించడంలో ఎన్జీవోలే కీలకపాత్ర పోషించాలన్నారు. ఏపీలో 974 కిలోమీటర్ల తీరం ఉందని, వనరులు ఉన్నాయన్నారు. లుక్ ఈస్టు విధానంలో ఉన్న కేంద్రానికి ఏపీ అభివృద్ధి తప్పనిసరి అవుతుందన్నారు. నదుల అనుసంధానంతో గోదావరి జిల్లాల్లా రాయలసీమను మారుస్తామన్నారు. రాష్ట్రంలో బీచ్‌సాండ్, కోల్, గ్రానైట్, తదితర ఖనిజ సంపద ఉందన్నారు. ఈ సంపద అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. పెన్షన్‌లు సక్రమంగా లబ్ధిదారుల ఇళ్లకు చేర్చే బాధ్యత ఎన్జీవోలపైనే ఉందన్నారు. ఈ-పాస్, డ్వాక్రా వంటి అంశాల్లో ఉద్యోగుల సాయం చాలా బాగుందని ప్రశంసించారు. రాజధాని నిర్మాణంలో ఎన్జీవోలే అభివృద్ధి సారథులుగా నిలవాలన్నారు. తాజా పరిస్థితుల్లో ఉద్యోగులంతా టెక్నాలజీ వినియోగాన్ని అలవర్చుకోవాలన్నారు. చిన్నచిన్న తప్పులు చేసి, అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగుల్లో ఆ ధోరణి పొగొట్టే ప్రయత్నానికి ఎన్జీవోలే టీచర్లుగా మారాలన్నారు. అటువంటివారిలో చైతన్యం తీసుకువచ్చి, రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వామ్యులుగా మార్చాలన్నారు. ప్రైవేటు సంస్థల జీతభత్యాలు ప్రభుత్వశాఖల్లో ఇస్తేనే అవినీతిరహిత ఆంధ్రప్రదేశ్‌గా మారుతుందన్నారు. ప్రైవేటీకరణ తన ఉద్దేశ్యం కాదని, పిపిపి విధానంతోనే అత్యంతవేగంగా అభివృద్ధి సాధ్యపడుతుందన్న విషయాన్ని ఉద్యోగులంతా గ్రహించాలని కోరారు. భావితరాల కోసం ఎన్జీవోలంతా పూర్తిగా సహకారం అందించాలని సిఎం కోరారు. కార్యక్రమంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, కిమిడి మృణాళిని, రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, చీఫ్ సెక్రటరీ ఎస్‌పి టక్కర్, కలెక్టర్ పి లక్ష్మీనృసింహం, ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పి అశోక్‌బాబు, సహాయ అధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు, జిల్లా అధ్యక్షు, కార్యదర్శులు హనుమంతు సాయిరాం, ఆర్‌విఎన్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.