ఆంధ్రప్రదేశ్‌

నలుగురు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 12: తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు తమ పార్టీలో చేరేందుకు టచ్‌లో ఉన్నారని వైస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు వెల్లడించారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వైసిపి జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు పినె్నల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, షేక్ ముస్త్ఫా, కోన రఘుపతి, ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎప్పుడైనా తమ పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వారంతా తమతో టచ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ మూతపడే దశలో ఉండటంతో ఆ వ్యవహరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడలో భాగంగానే వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నట్లు దుష్ప్రచారం ప్రారంభించారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ మునిగే పడవ లాంటిదని, అటువంటి పార్టీలో చేరేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. గత రెండేళ్ల కాలంలో అధికారపార్టీ ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు. ఆ పార్టీలోని ఎమ్మెల్యేలను ప్రజలు చూసి ఈసడించుకుంటున్నారన్నారు. ఇటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీలోకి ఎవరైనా వెళతారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒత్తిడి తట్టుకోలేక ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
బాబుది మైండ్ గేమ్: ఎంపి మేకపాటి
నెల్లూరు: తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోవడంతో దిక్కుతోచనిస్థితిలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆంధ్రాలో మైండ్ గేమ్ ఆడుతున్నారని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని తన అతిథిగృహంలో ఆయన శుక్రవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ బాబు మైండ్‌గేమ్‌కు వైకాపా ఎమ్మెల్యేలు భయపడరన్నారు. తెలంగాణలో టిడిపి తుడిచి పెట్టుకుని పోవడంతో ఆ విషయాల నుంచి ప్రజలను మళ్లించడానికి చంద్రబాబునాయుడు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు పార్టీ మారే ప్రసక్తే లేదని మేకపాటి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ వీడే ప్రసక్తే లేదన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారని ఆరోపించారు. నీచమైన రాజకీయాలకు చంద్రబాబునాయుడు పాల్పడటం మంచిది కాదన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2026 తరువాతేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ప్రతిపక్షనేత నెల్లూరు ఎంపి మేకపాటి స్పష్టం చేశారు. పునర్విభజన విషయంలో జరుగుతున్న ప్రచారంపై స్పష్టత కోసం తాను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ డాక్టర్ నసీమ్‌జైదీని కలిసినట్లు వివరించారు.