సంపాదకీయం

‘నీడ’లేని జీవజాలం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదిగో పులి అని అరిస్తే ఇదిగో తోక...అని అన్నట్టుగా కథ నడుస్తోంది! ఈ కథ ఆంగ్ల రచయిత రాసీపురం కృష్ణస్వామి నారాయణ్ ముప్పై ఐదేళ్ల క్రితం వ్రాసిన కథకు కొంత మేర పునరావృత్తి! చిరుతపులి విరుచుకొని పడుతోందన్న భయంతో బెంగుళూరు తూర్పు శివార్లలోని నూట ముప్పయి పాఠశాలలకు గురువారం అధికారులు సెలవిప్పించారట. ఇలా సెలవిప్పించడం ముందు జాగ్రత్త చర్యలలో భాగం! ఇలా అధికార యంత్రాంగం అప్రమత్తం అయిపోయేసరికి భయపడింది కాబోలు..ఆ చిరుతపులి మళ్లీ కనిపించలేదు. ఏడవ తేదీన ఇదే ప్రాంతంలో చూపుసరిగాలేని, కొన్ని పళ్లు లేని ఒక చిరుతపులి ఒక పాఠశాలలోకి చొరబడి ఇద్దరిని గాయపరిచింది. తరువాత ఆ చిరుత పులిని మత్తు తూటాల-ట్రాంక్విలైజర్స్‌కు గురి చేసి పట్టుకోగలిగారు! అందువల్ల పదకొండవ తేదీన ఒక మహిళకు ఆరుకిలోమీటర్ల ఆవల మరో చిరుతపులి కనిపించింది. అదీ ఇదీ ఒకటేనా? వేరువేరు చిరుతపులులా అన్న మీమాంస కూడా మొదలైంది. ఏడవ తేదీన పాఠశాలలోకి చొరబడి గాయపరిచిన అర్థాంధ వన్యమృగం ఆరోజే పట్టుబడింది! అలాంటప్పుడు అదీ, పదకొండవ తేదీన ఆ మహిళకు కన్పించిన లేదా కన్పించినట్టు ఆ మహిళ భావించిన చిరుతపులీ ఒకటి కావడానికి వీలులేదన్నది జనం ఆలస్యంగా గ్రహించిన సమాచారం! ఎందుకంటే పట్టుబడిన, పళ్లు విరిగిన చిరుతపులి మళ్లీ తప్పించుకోలేదు. అందువల్ల నూటముప్పయి పాఠశాలలకు సెలవు ఇప్పించడానికి వీలుగా ఆ మహిళ దర్శించిన చిరుతపులి ఈ పళ్లు లేని పులి కావడానికి వీలు లేదని అధికారులు నిర్ధారించారట! అందువల్ల పాఠశాలల వద్ద పులిబోనులను బోనులలో ఎరలను ఏర్పాటు చేసి గురువారంనాడు మిక్కిలి అప్రమత్తంగా ఉన్నారు. చూపు ఆనని ఆ మొదటి చిరుతపులి ఏడవ తేదీన ఇద్దరిపై దాడి చేసింది. ఈ దాడి సమయంలోనే ఆ పులికి పళ్లు కొన్ని విరిగిపోయి ఉండవచ్చునని కూడ అధికారులు అనుమానించారు. ఎందుకంటే దాడి సమయంలో మానవులు ధరించి ఉన్న లేదా జేబులలో ఉన్న లోహ పదార్ధాలను గట్టిగా కొరికినప్పుడు చిరుతపులులకు, పెద్ద పులి పిల్లలకు పళ్లు విరిగిపోయే ప్రమాదం ఉంది! కవి సమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ దాదాపు అరవై ఏళ్ల క్రితం పులుల సత్యాగ్రహం అన్న నవలను వ్రాశారు. ఆ నవలలో పులులు రైలు ప్రయాణీకులపై దాడి చేస్తాయి. ఆ సమయంలో ఆరు నెలలలోపు వయస్సు ఉన్న ఓ చిట్టిపులి ఉత్సాహం కొద్దీ తాను కూడ దాడి చేసింది. దాడి సమయంలో వజ్రాల నగలనుకొరికి పళ్లు ఊడగొట్టుకున్నదట! ఇప్పుడు కంటికి పొర ఏర్పడిన చిరుత అడవినుంచి అయోమయంగా బెంగుళూరులోకి చొరబడింది. ఏడవ తేదీన ఇద్దరిని గాయపరచడం దురదృష్టకరం. గాయపడినవారిలో ఒకరు పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు సంజయగుబ్బి. దాడి జరిగింది ఆదివారం కాబట్టి పాఠశాలకు సెలవుదినం! అయతే గురువారం పాఠశాలలకు పనిదినం కాబట్టి పులి భయంతో అధికార్లు ముందు జాగ్రత్త చర్యగా సెలవుదినం ప్రకటించారు.
కర్నాటక రాజధాని బెంగుళూరులో ఇలా చిరుతపులి బీభత్సం సాగిన సమయంలోనే పశ్చిమ బెంగాల్‌లోని సిల్‌గుడి నగరంలోని ఒక విశాలమైన వాణిజ్య ప్రాంగణంలోకి ఒక మహా గజరాజు చొరబడిపోయింది. జనం బెంబేలెత్తిపోయారు, గగ్గోలు చెలరేగింది. ఏనుగు అనేక గంటలపాటు యథేచ్చగా బీభత్సకాండను కొనసాగించగలిగింది. వన్యమృగాలు ఇలా తమ ఆవాసాలను వదిలిపెట్టి జనావాసాలలోకి ఎందుకని చొరబడిపోతున్నాయన్న ప్రశ్నలు దశాబ్దులుగా కొనసాగుతునే ఉన్నాయి. సమాధానాలు కూడ మనకు తెలుసు! పుట్టను తవ్వే వాడి కాళ్లకు చిట్టి చీమలు చుట్టుకుంటున్నాయి, పుట్టలో వేలు పెట్టే వరకు చిట్టి చీమ కుట్టకపోవడం ప్రాకృతిక ధర్మం. వేలుకాదు, కాలు కాదు, గునపాలనే గుచ్చి పుట్టలను ధ్వంసం చేస్తున్నాము. చిట్టిచీమలు సైతం ప్రతిఘటిస్తున్నాయి, మన కాళ్లకు చుట్టుకుని ఒళ్లంతా పాకి కరచి మరణిస్తున్నాయి! చీమ ప్రతిఘటనకు విస్తృతి పెద్దపులుల దాడి, చిరుతపులుల బీభత్సం, ఏనుగుల విధ్వంసం! దేశంలోని మొత్తం భూభాగంలో నలబయి శాతం అడవులుండిన సమయంలో మానవులు స్వచ్ఛమైనగాలిని పీల్చుకున్నారు, ఔషధ జలాలతో నిండిన నదులలో స్నానం చేయగలిగారు, ఆరోగ్యవంతంగా జీవించగలిగారు! వన్యమృగాలను పశుపక్ష్యాదులను, చిట్టి ఉడుతలను, సీతాకోక చిలుకలను బతకనిచ్చారు! కానీ అడవుల విధ్వంసంతో నీడను కోల్పోయిన గూడును కోల్పోయిన వనచరాలు దిక్కుతోచని రీతిలో పరుగులు తీస్తున్నాయి. ఈ పరుగుల బాటలో అవి అయోమయంగా జనావాసాలలోకి చొరబడిపోతున్నాయి! ప్రపంచీకరణ పారిశ్రామిక బకాసుర క్షుదాగ్ని జ్వాలలకు ఆకుపచ్చదనాన్ని ఆహుతి చేస్తున్నవారు ఆలోచించవలసిన సమయమిది..
ఇప్పుడు బెంగుళూరు పాఠశాలలోకి పులి చొరబడినట్టే రాసీపురం కృష్ణస్వామి నారాయణ్ 1980వ దశకం ఆరంభంలో వ్రాసిన నవలలో పులి మాల్‌గుడి పాఠశాలలోకి చొరబడిపోయింది! బెంగుళూరులోకి చొరబడినది మచ్చల మెకం! మాల్‌గుడిలోకి చొరబడినది చారల మెకం! ఇదీ తేడా. ఈ మచ్చల మెకం పాఠశాలలో ఇద్దరిని గాయపరిచింది. మాల్‌గుడి పాఠశాలలోకి చొరబడిన చారల మెకం-పెద్దపులి-ఎవ్వరినీ గాయపరచలేదు. హెడ్‌మాస్టర్ గదిలోకి ప్రవేశించి టేబుల్ కింద తలపెట్టి నిద్రపోయింది. పులిని చూసి బెంబేలెత్తిన హెడ్‌మాస్టర్ ఎగిరిపోయి గదిలోని అటక మీద దాక్కోవడం వేరే సంగతి. వాస్తవ ఘటన ఆధారంగా నారాయణ్ మాల్‌గుడికి పెద్దపులి-ఎ టైగర్ ఫర్ మాల్‌గుడి-అన్న ఆ నవలను రాశాడు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగవద్ద త్రివేణి సంగమ స్థలిలో పనె్నండు ఏళ్లకోసారి కుంభమేళా జరుగుతుంది. దేశం నలుమూలలనుంచి వచ్చి చేరే భక్తులతో ప్రయాగ సంగమస్థలి జనసముద్రంగామారిపోవడం తరతరాల చరిత్ర. ఈ జన సముద్రం మధ్య ఒక ధర్మాచార్యుడు తన మిత్రుడైన పెద్దపులిని వెంటబెట్టుకుని నడిచివెళ్లేవాడు. ఆ సన్యాసి ఆ పెద్దపులిని గొలుసుతో కట్టి పట్టుకోలేదు. ఆ పులి స్వేచ్ఛగా ఆ యతి పక్కనే నడుస్తూ వెళ్లేది. గంటలపాటు వారిద్దరు అలా కుంభమేళా ప్రదేశంలో సంచరించేవారు! ఆ పులి జనం మీదకి దూకేది కాదు, ఎవ్వరికీ హాని చేసేది కాదు. ఈ వాస్తవాన్ని ధర్మాచార్యుని వెంట నడిచిన పులి చిత్రాలను వార్తాపత్రికలు ప్రచురించాయట! ఆర్.కె.నారాయణ్ ఈవార్తలను చదివి, చిత్రాలను చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు! ఆ పెద్దపులి గత జన్మలో తన సోదరుడని ఆ సన్యాసి చెప్పేవాడట! ఇదంతా వాస్తవ సంఘటనలోని దృశ్యం. ఈ వాస్తవం ఆధారంగా నారాయణ్ అద్భుతమైన పెద్దపులి ఆత్మకథ వ్రాశాడు! సృష్టిలోని సమస్త జీవజాలం అద్వితీయ సత్యంతో అనుసంధానమై ఉంది! విభిన్నంగా కన్పించే స్వరూపాల మధ్య విచిత్రమైన ఏకాత్మ స్వభావం నెలకొని ఉంది! ఇదీ పెద్దపులికీ పరివ్రాజకునికీ మధ్య నెలకొన్న సామ్యం!
ధ్యానం ద్వారా యోగా ద్వారా నిరంతర మానసిక పరివర్తన సకల జంతువులలోను సాధింపవచ్చునన్నది ప్రయాగ ఋషి నిరూపించిన చారిత్రక వాస్తవం! అంతర్జాతీయ యోగ దినోత్సవం జరపడం కూడ ఆరంభమైంది. వైరుధ్యం లేకుండా మానవుడు ఇతర జీవజాలంతో కలిసి జీవించగల మార్గం యోగా! పర్యావరణ పరిరక్షణకు ఈ యోగా దోహదం చేయాలి. నీడను కోల్పోయిన జంతువులు మేడలలోకి చొరబడుతున్నాయి. జంతువులకు నీడను కల్పిస్తే అవి మన మేడలలోకి రావు. జంతువులకు నీడ అడవి...