నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. గత మదమత్సరుండు, త్రిజగద్వినుతుండు వసిష్ఠపౌత్రు ఁడు
న్నమతి, శక్తిపుత్రుఁ డఘనాశన ఘోర రతపోధనుండు సు
న్రతుఁ డయి తీర్థ యాత్ర చనువాఁడు , పరాశరుఁదన్ను నీంద్రుఁడ
య్యతివఁ దలో దరిం గనియె నయ్యమునానది యోడరేవునన్

భావం: మదమాత్సర్యాలు లేని సాధుశీలి, ముల్లోకాల చేత పొగడ్తల నందుకొన్నవాడు, విశాల హృదయుడు, పాలను నశింప చేసే మహాతపస్సంపన్నుడు, వ్రతనిష్ట గలవాడు, వసిష్ఠుడికి పౌత్రుడు , శక్తిమహామునికి పుత్రుడు అయిన పరాశురుడనే పేరుగల మునీంద్రుడు తీర్థయాత్రకు వెళుతూ యమునా నది ఓడరేవులో ఆ మత్స్యగంధిని చూచాడు. వసురాజు వీర్యం తిన్న చేప గర్భవతిగా ఉండి జాలర్లకు దొరకగా ఆ చేపపొట్టను కోసి చూడగా వచ్చిన పిల్లల్లో స్ర్తిరూపంలో ఉన్న శిశువే పెరిగి పెద్దయ మత్స్యగంధి పేరుతో దాశరాజు పెంపకంలో చక్కని అవయవ సౌష్ఠవముతో అందరినీ ఆకర్షించే రూపంతో ధర్మాచరణ కలిగిన ఈ మత్స్యగంధినే నావ నడుపుతూ ఉన్నపుడు పరాశరుడు అను ముని కంటిలో పడింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము