జాతీయ వార్తలు

నాకు పాఠాలు చెప్పొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌బరేలీ, ఫిబ్రవరి 19: దేశ భక్తికి సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిల నుంచి పాఠాలు నేర్చుకోవల్సిన అవసరం తనకు లేదని, దేశభక్తి అన్నది తన రక్తంలోనే ఉందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. జెఎన్‌యు వివాదంలో తనపై దేశ ద్రోహం ఆరోపణలు చేయడాన్ని శుక్రవారం ఆయన తీవ్రంగా ఖండించారు.‘ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల ఉంచి దేశభక్తి గురించి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకులేదు. దేశభక్తి నా రక్తంలోనే ఉంది’ని ఆయన వ్యాఖ్యానించారు. జెఎన్‌యు అంశాన్ని రాహుల్ దృష్టికి తీసుకురాగా ‘తమకు నచ్చనివారి స్వేచ్ఛను హరించడం, గొంతు నొక్కడానికి దేశవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి’అని ఎద్దేవా చేశారు. సలోన్‌లో రైతు ముఖాముఖిలో పాల్గొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏపై దుమ్మెత్తిపోశారు. పప్పుదినులు ధరలు ఆకాశాన్నంటాయని, ఒక్క కందిపప్పు కిలో 200 రూపాయలకు పెరిగిపోవడం చరిత్రలో ఇదే మొదటి సారని ఆయన విమర్శించారు. హామీలు అమలుచేయడంలో మోదీ విఫలమయ్యారని ఆయ న ఆరోపించారు. ‘కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను పార్లమెంటులో ఎండగడతా’ అని రాహుల్ వెల్లడించారు. జెఎన్‌యు వ్యవహారంలో ఢిల్లీ పాటియాలా కోర్టు వద్ద జరిగిన ఘర్షణలు దేశ ప్రతిష్టకు మచ్చతెచ్చాయని అన్నారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తక్షణం జో క్యం చేసుకుని శాంతి భద్రతలు పరిరక్షించి ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు.
‘విద్యా సంస్థల్లో చొరబడడం, విద్యార్థులు స్వేచ్ఛను అణగదొక్కే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. దేశ వ్యాప్తంగా విద్యాలయాల్లోకి ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం జొప్పించడానికి ప్రయత్నాలు జ రుగుతున్నాయి’అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి తనపై చేస్తున్న దేశద్రోహం ఆరోపణలపై రాహుల్ ఘాటుగానే స్పందించారు. ‘దేశం కోసం నా కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. మళ్లీమళ్లీ చేస్తుంది’ అని ఉద్ఘాటించారు.