సంపాదకీయం

పాకిస్తానీల కొత్త పన్నాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా జిహాదీ ఉగ్రవాదులు పట్టుబడుతుండడం పాకిస్తాన్ ప్రభుత్వపు ఉసిగొలిపే విధానంలో మార్పు రాలేదనడానికి సరికొత్త నిదర్శనం. ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం పేరుతో చెలామణి అవుతున్న జిహాదీ ముఠాకు చెందిన పధ్నాలుగు మంది పట్టుబడడం విస్తరించిపోతున్న ఉగ్రవాద విష వ్యూహానికి మరో సాక్ష్యం. ఇరాక్ సిరియా మతరాజ్యం-ఐఎస్‌ఐఎస్- వారికి పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స విభాగమైన ఐఎస్‌ఐ వారికి మధ్య కొనసాగుతున్న అనుసంధానం శుక్రవారం నాటి అరెస్టులతో మరోసారి ధ్రువపడింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శితో మన దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శ జరుపవలసిన చర్చల కార్యక్రమాన్ని నిర్ధారించడంలో తలమునకలై ఉన్న మన ప్రభుత్వాన్ని శుక్రవారం దేశవ్యాప్తంగా పట్టుబడిన బీభత్సపు తోడేళ్లు ఇలా వెక్కిరించాయి. కర్నాటకలో, తెలంగాణలో, మహారాష్టల్రో, ఢిల్లీలో పట్టుబడిన ఈ ఐఎస్‌ఐఎస్ హంతకులకు ఇండియన్ ముజాహిద్దీన్ ముష్కరులతో సంబంధాలు నెలకొని ఉన్నాయట. ఇండియన్ ముజాహిద్దీలకు ఓవైపు ఐఎస్‌ఐఎస్ తోను మరోవైపు అల్‌ఖాయిదాతోను సంబంధ బాంధవ్యాలు నెలకొని ఉండడానికి సూత్రధారి ఐఎస్‌ఐ..అంతర్జాతీయంగా ఆధిపత్యం కోసం పరస్పరం పోటీపడుతున్న అల్‌ఖాయిదా-తాలిబన్ కూటమి,ఐఎస్‌ఐఎస్ ముఠాల వారు ఐఎస్‌ఐతో మాత్రం స్నేహాన్ని, అనుసంధానాన్ని సాగిస్తున్నారు. అందువల్ల ఇండియన్ ముజాహిద్దీన్ ముష్కరులతో ఐఎస్‌ఐఎస్‌ను అనుసంధానం చేస్తున్నది ఐఎస్‌ఐ మాత్రమేనన్నది బహిరంగ రహస్యం. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం మనదేశ ప్రజలపైకి జిహాదీ నరపిశాచులను ఉసిగొల్పే కార్యక్రమాన్ని వదలిపెట్టలేదు. వదలిపెట్టని పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులతో మన ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరపడం హంతకునితో కలిసి హతుని కుటుంబం వారు విందు భోజనం చేయడం వంటిది. హరిద్వార్‌లో ఇదివరకే పట్టుబడిన జిహాదీలతో శుక్రవారం బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రదేశాలలో పట్టుబడిన వారికి సంబంధాలున్నాయన్నది మరో ధ్రువీకరణ. హరిద్వార్‌లో పట్టుబడినవారు రైళ్లలో పేలుళ్లు జరపడానికి మందుగుండు సామగ్రిని సిద్ధం చేసుకున్నారట. శుక్రవారం పట్టుబడిన వారు దేశవ్యాప్తంగా అనేకచోట్ల జనావాసాల మధ్య పేలుళ్లు జరపడానికి సమాయత్తమయ్యారట. మనదేశంలో ఐఎస్‌ఐఎస్ హంతకుల కోసం నిధులను కూడ సేకరిస్తున్నారన్నది ‘వెల్లడి’ కూడ కేవలం లాంఛనం. హంతకులను సమీకరించుకొన్న వారు నిధులను సమకూర్చుకొనడంలో ఆశ్చర్యం ఏముంది? ఐఎస్‌ఐ ప్రేరిత ఐఎస్‌ఐఎస్ వారి కుట్రలను మరోసారి బద్దలు చేసిన మన జాతీయ పరిశోధనా సంస్థ-ఐఎన్‌ఏ- వివిధ రాష్ట్రాల బీభత్స వ్యతిరేక బృందాల-ఎటిఎస్‌లు-వారు అభినందనీయులు. గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో భద్రత అప్రమత్తం అయిందనడానికి శుక్రవారం నాటి పరిణామం తార్కాణం.
ఇవన్నీ బీభత్సకారుల కలాపాల వివరాలు. కానీ వివరాల కంటె జిహాదీ ముఠాల స్వరూప స్వభావాలు, లక్ష్యం ఆందోళనకరం. భారత వ్యతిరేక బీభత్స స్వరూపం పాకిస్తాన్ గడ్డపైనుండి విరుచుకొని పడడం దశాబ్దులకు పూర్వం నాటి మాట. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు, కిరాయి హంతకులు ‘రేఖ’ దాటి చొరబడడం మన ప్రజలను హత్యచేయడం మళ్లీ వెనక్కి పారిపోవడం అప్పటి కథ. అప్పుడు కూడ మన ప్రభుత్వం నిరసన తెలిపేది. సద్దుమణిగిపోయిన తరువాత యథావిధిగా మన ప్రభుత్వం పాకిస్తాన్ నియంతలతో చర్చలను ప్రారంభించేది. పాకిస్తానీ బీభత్సకారులు విహారయాత్రల పేరుతో, వ్యాపారం పేరుతో, బంధువులను కలుసుకొనే నెపంతో వీసాలు తీసుకొని మనదేశానికి రావడం రెండవ దశ. ఇలా రాకపోకలు సాగించిన పాకిస్తానీలకు మనదేశంలోని దేశద్రోహులు-వారి పన్నాగం తెలియని అమాయకులు కూడ- స్థావరాలను కల్పించడం వల్ల పాకిస్తానీ జిహాదీలు వీసా గడువు ముగిసిన తరువాత ఇక్కడే స్థిరపడిపోయారు. బంగ్లాదేశ్ నుండి, పాకిస్తాన్ నుండి జిహాదీలు అక్రమంగా మనదేశంలోకి చొరబడి పోయి ఇక్కడే స్థిరపడి పోవడం మూడవ దశ. పాకిస్తానీ ఐఎస్‌ఐ ఈ దశలోమనదేశంలో చాపకింది విషంలాగా విస్తరించింది. ఇలా పాకిస్తాన్ నుంచి వచ్చిపడిన వారు అంతర్గత విద్రోహుల సహకారంతో హత్యాకాండ సాగించడం తరువాతి కథ. ఈ దశలో కూడ మన ప్రభుత్వం వారు పాకిస్తాన్‌ను నిరసించడం...ఆ తరువాత చర్చలను పునఃప్రారంభించడం పునరావృత్తి..
ఈ చర్చల ప్రహసనం వల్ల పాకిస్తాన్ ప్రభుత్వం దృష్టిలో మన ప్రభుత్వం తేలిక అయిపోయింది. తమ జిహాదీలు ఎంతటి భయకర బీభత్స కృత్యాలను జరిపినప్పటికీ ఎంతమంది భారతీయులను హత్య చేసినప్పటికీ భారత ప్రభుత్వం నిరసనల దశను దాటి చర్యలను తీసుకొనే దశకు ఎదగబోదన్నది పాకిస్తాన్ పౌర పాలకులకు, వారిని నియంత్రిస్తున్న సైనిక అధికారులకు ఏర్పడిన దృఢమైన విశ్వాసం. ప్రస్తుతం మనదేశంలోనే పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో దేశ విద్రోహులైన జిహాదీలు ఏర్పడిపోయారు. దశాబ్దుల తరబడి ఐఎస్‌ఐ వారు అమలు జరిపిన కుట్ర కారణంగా పాకిస్తాన్ ప్రేరిత బీభత్స రూపానికి మనదేశంలోనే కాళ్లు, చేతులు, ముక్కులు, ముఖాలు, ఏర్పడిపోయి ఉన్నాయి. బుద్ధి మాత్రం పాకిస్తానీ ప్రభుత్వం. మనదేశంలోని జిహాదీలు యదేచ్ఛగా పాకిస్తాన్‌కు వెళ్లి వచ్చారు, వెళ్లి వస్తున్నారు. ఇదంతా ఐఎస్‌ఐ వారి అనుసంధానం. లష్కర్ ఏ తయ్యబా, జైషే మహమ్మద్, జమాత్ ఉద్ దావా వంటి పాకిస్తానీ జిహాదీ ముఠాలూ, బంగ్లాదేశ్ నుండి వచ్చిపడిన హుజీ ముఠావారు, అఫ్ఘానీ తాలిబన్లు, బర్మా నుంచి శరణార్థులతో కలిసి వచ్చిన జిహాదీలు, మనదేశంలోని హిజ్‌బుల్, జెకెఎల్‌ఎఫ్, సిమి, ఇండియన్ ముజాహిద్దీన్ ముఠాలు పరస్పరం అనుసంధానమై ఉండడం ఏళ్ల తరబడి నడుస్తున్న కుట్ర..ఈ అనుసంధాన కర్త ఐఎస్‌ఐ. ఈ జిహాదీ భయంకర వ్యవస్థలోకి ఐఎస్‌ఐఎస్ చేరడం కూడ ఐఎస్‌ఐ వారి వ్యూహంలో భాగమన్నది పెద్దగా ప్రచారం కాని కఠోర వాస్తవం.
ఇలా ముఠాల పేర్లు మారిపోతున్నప్పటికీ భారతదేశాన్ని బద్దలు కొట్టాలన్న జిహాదీల లక్ష్యం, మాత్రం మారడంలేదు. ప్రస్తుతం ఐఎస్‌ఐఎస్ జిహాదీ ముఠాల వారు దేశమంతటా పట్టుబడుతున్నారు. ఐఎస్‌ఐఎస్ ప్రధానంగా ఇరాక్ కేంద్రంగా విస్తరించి సిరియా తదితర పశ్చిమ ఆసియా దేశాలలో హత్యాకాండ జరుపుతోంది. కాబట్టి పాకిస్తాన్‌కు ఈ ఐఎస్‌ఐఎస్ వారి భారత వ్యతిరేక కలాపాలతో సంబంధం లేదన్న భ్రమను వ్యాపింప జేయడం ఐఎస్‌ఐ ఎత్తుగడ. కానీ ఐఎస్‌ఐఎస్ జిహాదీలు మాత్రమే కాదు, ఆఫ్రికాలోని బోకోహరామ్ ముఠాకు చెందిన జిహాదీ హంతకులు సైతం పాకిస్తానీ ఐఎస్‌ఐ మార్గదర్శనంలోనే ముందుకు సాగుతున్నాయి. లేనట్టయితే మనదేశంలో ఐఎస్‌ఐఎస్ కలాపాలకు ప్రాతిపదిక ఏర్పడి ఉండేది కాదు. అందువల్ల ఐఎస్‌ఐఎస్ హంతకులు నిజానికి ఐఎస్‌ఐ దళారులు. హత్యలు జరపడం మాత్రమే బీభత్స చర్య కాదు, ప్రయత్నం చేయడం కూడా బీభత్సంలో భాగం..