హైదరాబాద్

నేడు జలమండలి కార్మిక ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: జలమండలి కార్మిక సంఘం ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వారం రోజుల పాటు ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ ఎన్నికల్లో అధికార కామ్‌గార్ యూనియన్, మాజీ మంత్రి ఎం.ముఖేష్‌గౌడ్ నాయకత్వంలోని వాటర్ వర్క్స్ ఎంప్లారుూస్ యూనియన్ తెలంగాణ యూనియన్‌లు పోటీ చేస్తున్నాయి. ఈసారి ఎన్నికలు సి.సతీష్‌కుమార్ అభ్యర్థిగా కామ్‌గార్ యూనియన్, ఎం.విక్రమ్‌గౌడ్ అభ్యర్థిగా వాటర్ వర్క్స్ ఎంప్లారుూస్ యూనియన్ తెలంగాణ బరిలోకి దిగారు. ఎన్నికల నిర్వాహణ కోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగర కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ గంగాధర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 22 కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖైర్‌తాబాద్, గోషామహల్, అస్మాన్‌ఘాడ్, మిస్రీగంజ్, అలియాబాద్, నవోదయకాలనీ, ఉస్మాన్‌సాగర్, రెడ్‌హిల్స్, నారాయణగుడా, చిలకల్‌గూడ, ఎస్‌ఆర్ నగర్, మారేడ్‌పల్లి, పెద్దపూర్, పటాన్‌చేరు, కలాబ్గుర్, రాజమ్‌పేట, కెపిహెచ్‌బి జెఎన్‌టియు, సాహేబ్‌నగర్, సైనిక్‌పూరి, కుత్బుల్లాపూర్, హిమాయత్‌సాగర్, హైదర్‌నగర్-లింగంపల్లితో పాటు హఫీజ్‌పేట్‌లో ఏర్పాటు చేసిన మొత్తం 22 పోలింగ్ కేంద్రాల్లో 3966 మంది జలమండలి ఉద్యోగ, కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 3480 మంది పురుషులు, 485మంది మహిళలు, 735 మంది మైనార్టీలున్నారు. ఈ ఎన్నికలో పోటీచేస్తున్న అధికార కామ్‌గార్ యూనియన్‌కు బాణం గుర్తును, ముఖేష్ యూనియన్ అయిన వాటర్ వర్క్స్ ఎంప్లారుూస్ యూనియన్ తెలంగాణ యూనియన్‌కు నిచ్చెన గుర్తును కేటాయించారు. ఈనెల 27వ తేదీన ఎన్నికల్లో ఓటింగ్ ఉదయం 9గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతుంది.