జాతీయ వార్తలు

స్మృతి ఇరానీపై హక్కుల తీర్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై చర్చ జరిగిన సందర్భంగా పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీపై సభా హక్కుల తీర్మానం ప్రతిపాదించేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, జెడి(యు) తదితర ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్షాలు ఈ అంశంపై సోమవారం లోక్‌సభలో సభా హక్కుల తీర్మానాన్ని ప్రతిపాదించనున్నాయి. స్పీకర్ సుమిత్రా మహాజన్ తమ సభా హక్కుల తీర్మానాన్ని తిరస్కరించే పక్షంలో ఉభయ సభలను స్తంభింపజేయాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. స్మృతి ఇరానీ రోహిత్ వేముల ఆత్మహత్యపై పార్లమెంటుకు తప్పుడు సమాచారం ఇచ్చారు, అందుకే ఆమెపై సభా హక్కుల తీర్మానాన్ని ప్రతిపాదిస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముకుల్ వాస్నిక్, కుమారి శెల్జా శనివారం విలేఖరులకు తెలిపారు. సిపిఎం సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు సలీం కూడా ఇదే విషయం చెప్పారు. స్మృతి ఇరానీ కావాలనే పార్లమెంటును తప్పుదోవ పట్టించారని ఆయన విమర్శించారు. సలీంతోపాటు జెడి(యు) రాజ్యసభ సభ్యుడు కెటిఎస్ త్యాగి కూడా స్మృతి ఇరానీపై సభా హక్కుల తీర్మానం ప్రతిపాదించనున్నారు. సలీం లోక్‌సభలో, త్యాగి రాజ్యసభలో తీర్మానాలు ప్రతిపాదించనున్నారు. రోహిత్ వేముల ఆత్మహత్యపై పార్లమెంట్‌లో తప్పుడు ఆధారాలు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి స్మృతిఇరానీ పై సభా హక్కుల ఉల్లంఘన నోటిసులు ఇస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వేల్లడించారు. రోహిత్ చట్టంకోసం అన్ని పార్టీలతో కలిసి కేంద్రపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. రోహిత్ తల్లి రాధిక శుక్రవారం మాట్లాడుతూ స్మృతి ఇరానీ పార్లమెంటులో తప్పులు చెప్పిందని ఆరోపించటం తెలిసిందే. రాధిక శనివారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిసి స్మృతి ఇరానీ పార్లమెంటులో రోహిత్ మరణం గురించి తప్పుడు సమాచారం ఇవ్వటం గురించి చెప్పినట్లు తెలిసింది. రోహిత్ దళితుడు కాదని స్మృతి ఇరానీ పార్లమెంటులో చెప్పటం సత్యదూరమని వాదిస్తున్నారు.

రోహిత్‌ను జాతి వ్యతిరేకిగా చిత్రీకరించటాన్ని కూడా రాధిక ప్రశ్నించారు.