Others

రాలిపోయే పువ్వా.. నాకు నచ్చిన పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృదేవోభవ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..’ పాట నాకెంతో ఇష్టమైంది. 1993లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఫిలిమ్‌ఫేర్ అవార్డు అందుకున్న చిత్రమిది. ఉత్తమ గీత రచయితగా వేటూరి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పాట ఇది. అత్యుత్తమ సాహిత్యపు విలువలు, హృదయాన్ని ద్రవింపచేసే సంగీతం, అణువణువునా కరుణరసం ఉట్టిపడేలా బాణీ, పాట చిత్రీకరణ వెరసి -తెలుగు సినీ వినీలాకాశంలో ఖ్యాతిని సాధించింది. ఇప్పటికీ ఈ పాట వింటుంటే హృదయం ద్రవించి కన్నీళ్లు వర్షించని కన్నులుండవంటే అతిశయోక్తికాదు. భర్త ఓ తాగుబోతు. రౌడీ చేతిలో హత్యకు గురైతే అన్యోన్యంగా సాగుతున్న కథానాయిక సంసారంలో అలజడి రేగుతుంది. వారికి నలుగురు పిల్లలుండగా, ఆమెకు క్యాన్సర్ దాపురిస్తుంది. ఆరు నెలలకంటే ఎక్కువగా బ్రతకని ఆమె, తన తదనంతరం నలుగురు పిల్లల్ని అనాధాశ్రమంలో ఉంచకుండా దత్తతివ్వాలని నిర్ణయించుకుంటుంది. ముగ్గురు పిల్లలు దత్తతకువెళ్లినా, పోలియో ఉన్న బాబును మాత్రం ఎవరూ తీసుకోరు. తర్వాత ఆ పిల్లాడి భవిష్యత్ ఏమిటని తల్లి బాధపడుతూ, నలుగురు పిల్లలను ఒక్కసారి కలుసుకోవాలని వెళ్లే సందర్భంలో నేపధ్య పాటగా వస్తుంది. ప్రేమ, కరుణ, జాలి, దయ, అనురాగం, వాత్సల్యంలాంటి అత్యుత్తమ సద్గుణాలకు ప్రతిరూపం తల్లి అంటారు. ఆ పాత్రలో మాధవి ఒదిగిపోయి, తన నటనతో కంట తడిపెట్టించింది. ఇంత గొప్ప సాహిత్యంవున్న పాటను మన వేటూరి తప్ప మరెవ్వరూ రాయలేరు. ఈ పాట వింటున్నప్పుడల్లా మనసు బాధతో మెలితిరుగుతుంది. తెలుగు సినీ పాటల ప్రస్థానంలో ఈ పాట నిస్సందేహంగా ఉన్నతమైనది.
- ఎం కనకదుర్గ, తెనాలి