Others

యమహానగరి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగాల్ సాంస్కృతిక రంగానికి వేటూరి గీతాంజలి -యమహానగరీ కలకత్తా పురీ. చూడాలని వుంది చిత్రంలో కథానాయకుడు చిరంజీవి కోల్‌కతా వస్తాడు. ఆ సన్నివేశానికి అనుగుణంగా వేటూరి కలంనుండి జాలువారిన -యమహానగరీ కలకత్తాపురీ’ అన్న పల్లవితో పరిమళించిన పాట ఇది. ముందుగా మహానగరం కలకత్తాలో కనబడేవి హుగ్లీ నది, హౌరా బ్రిడ్జి. తరువాత భారత స్వాతంత్య్ర సంగ్రామ నేత నేతాజీ జన్మస్థలంగా కనబడి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్ర కవీంద్రుని గీతాంజలి వినబడుతుంది. ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస, విశ్వజాగృతి గావించిన వివేకానందుల బాట... ఇలా భావిస్తూ జనంలోకి వస్తే బిజీ బిజీ బ్రతుకుల గజిబిజి ఉరకల పరుగుల మహానగరం. ‘అమ్మా సరోజినీదేవీ స్ర్తిజాతి శిరోమణి వమ్మా’ అన్న ఘంటసాల ఆలపించిన బెంగాలీ కోకిల ముత్యాలు గోవిందరాజులునాయుడు చేయిపట్టి తెలుగింట కోకిలగా దర్శనమిస్తుంది. ప్రసిద్ధ నవలాకారుడు శరత్‌బాబు కనబడతాడు. కథలకు నెలవై, కళలకు కొలువైన కలకట నగరం కిటకిటలో చిన్న ఊరట. భారత స్వాతంత్య్ర సముపార్జనలో కీలకస్థానం ఆక్రమించిన వందేమాతరంతో బంకించంద్ర చటర్జీ మనముందు నిల్చుంటారు. కలకత్తా కాళీ దర్శనం, చలనచిత్ర పితామహుడు సత్యజిత్‌రే తెరపైకి వస్తారు. చలనచిత్ర సంగీత శిరోమణి ఎస్‌డి బర్మన్ ఓ ప్రక్క మధుర సంగీతాన్ని వినిపిస్తూవుంటే, ప్రేమించే పెదవులకన్నా సాయంచేసే చేతులే మిన్న అంటూ కుష్ఠురోగులను అక్కున చేర్చుకున్న ప్రపంచమాత మదర్ థెరిస్సా వౌన దృశ్యం. చివరిగా హృదయపు లయలను శ్రుతిపరచిన ప్రియ శుక పిక ముఖ సుఖ రవళులతో అందరూ నిలుచుని పాడే రవీంద్ర జాతీయ గీతం జనగణమన. ఇంతటి సాంస్కృతిక వైభవాన్ని సంతరించుకున్న గీతాన్ని రచించిన వేటూరికి పాదాభివందనం. మణిశర్మ స్వరపరిస్తే.. హరిహరన్ ఆలపిస్తే.. మెగాస్టార్ చిరు త్యాగరాజుగా నటించిన ఈ గీతం చిరంజీవే.

-అయల సోమయాజుల గోపాలరావు, విజయనగరం