అక్షరాలోచన

నాలో నా ఊరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని కాలాలు
అలలు అలలుగా నడచి వచ్చినా
నాలో వట వృక్షంలా నిలిచిన నా ఊరు
విజ్ఞానాన్ని బుర్రలోకి వొంపుకుంటూ
ఎన్ని దూరాలు
జీవిత సందర్భాలుగా మారినా
కాస్తంత సమయం దొరికితే చాలు
నా పైరు నా పల్లె
రెప్పల మీద పిట్టల్లా వాలుతూనే ఉంటాయి
నా పల్లెలో
వలస పక్షుల్ని చూస్తున్నాను
తడారిన గుండెల్లో
పగిలిన బీడు భూముల్లో
మొలకెత్తని ఆశలు
వలస పోతున్నాయి
అయినా చెదిరిన స్వప్నాల్ని
మళ్లీ నిర్మిస్తున్నాను
పల్లె గుర్తొస్తే చాలు
దేహం ముక్కలు ముక్కలుగా
రాలిపోతుంది
పల్లె రుణం తీర్చుకోడానికి
మనసు ప్రణమిల్లుతోంది
పల్లెకు పోతాను
రైతుని విజ్ఞాన నిధిగా నిలిపేవరకూ
పల్లెకు పోతాను
మేట వేసిన జీవితంలో
ఒక ఆశగా మొలకెత్తుతాను.
***********
మాకేంటట
-అమర్లపూడి కళ్యాణ్‌కుమార్
8341136796
మీ గెలుపోటములతో మాకేం పని
ఎవ్వరు ఎవ్వరిపై గెలిస్తే ఏంటట
మా ఎడారి బతుకుల్లో పచ్చికేమైనా మొలుస్తుందా?
మా తలపై ప్రపంచ బ్యాంక్ అప్పులేమైనా
మాఫీ అవుతాయా
మీ వెన్నుపోటు కూటముల రగడలో
పన్నుపోట్లు ఏమైనా తగ్గుతాయా?
అందలాలు అందుకుని
అధికారం అనుభవించేది మీరే
కూటి కోసం, కూలి కోసం
బతకలేక, బతుకే లేక అల్లాడుతూ మేముంటే
కుర్చీలాటలో
దోచింది దాచుకొనే ప్రయత్నంలో మీరు
ఎవ్వరు కుర్చీ ఎక్కి కూర్చొంటే ఏంటట
మాకు వొరిగింది ఏంటట
మీ ఎన్నికల సుడిగుండాలలో తిరిగి తిరిగి
ఎక్కడున్నామో తెలిసే లోపలే
ఒక్కింట నాలుగో వంతు
మందు మత్తులో మమ్మల్ని ముంచి
మూడింట రెండు వంతుల మెజారిటీలో
పీఠమెక్కి
ప్రతి బడ్జెట్ పీఠిక మీరే రాసి
స్కాముల సంపాదనలో
స్వౌముల సాహచర్యంతో
మునిగితేలుతూ...
మరలా..
ఐదేళ్లకు మా గుడిసె వాకిట్లో
అన్యమనస్కపు చిరునవ్వుల
అరదండాలతో
మీ రాజకీయ ‘వారసులని’ పరిచయం చేసినా
మాకు నువ్వేం చేశావు అని అడగలేనోళ్లకు
ఎవ్వరు ఎవ్వరి మీద గెలిస్తే ఏంటట
ఎవ్వరు గద్దెనెక్కితే ఏంటట
అంతా కొత్త సీసాలో పాత సరుకే.
*******
గుండె గుడిలో నా కవిత

-తోట సదానందం
990 859 4669

నే పంపిన ముద్దులకూన
నా మురిపాల కవిత
పత్రికల వారికి అందిందో లేదో
సంపాదకుడి వరకు చేరిందో లేదో

చేరిందేననుకున్నా
పరిశీలనలో నెగ్గిందా
లేక చెత్తబుట్టలోకి
విసిరేయబడిందా? నా గుబులు

ఎలా అయితేనేమి ఆ రచన
నే కన్న నా ముద్దుబిడ్డ
నా మనో పలకపై చెదరక
శిలా శాసనమై మెరుస్తుండగ
ఇక బెంగ నాకెందుకు?

ఊడుపులో పోయి
పురపాలక చెత్త కుప్పల్లో దహింపబడినా
ఆ యజ్ఞ ధూమంలోంచి
ఇష్టసఖి నా సాహితి, తనకు అంతం లేదంటూ
అక్షర జల్లై కురుస్తుండగ
ఇక నేను చింతించడమెందుకు?

అంతులేని ఆటుపోటుల్లో సైతం
స్థిరంగ నా కవిత నా గుండె గుడిలో
ధైవంగా ప్రతిష్ఠితమై అభయహస్తం చూపుతుంటే
ఇక నాకు ఆందోళన పోయి
మనోస్థైర్యం కలుగదెందుకు?

-గవిడి శ్రీనివాస్ 9966550601