సబ్ ఫీచర్

నడత నేర్పే దుస్తులే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ సినిమాలో హీరోయిన్ ఆఫీసుకు తయారవుతుంటుంది. ఇంతో క్యాబ్ డ్రైవర్ హారన్ కొడుతుంటాడు. ఏ చీర కట్టుకోవాలో తెలియక వార్డు రోబ్ అంతా చిందర వందర చేసేసి చివరకు తన ఫ్రెండ్‌కు ఫోన్ చేస్తుంది. ఆమె చెప్పిన చీర హడావుడిగా కట్టుకుని ఆఫీసులో అడుగుపెట్టగానే అందరూ హాయ్ అని చెబుతుంటారు. ఇది సినిమా అయినప్పటికీ నేడు ఉద్యోగినుల వస్త్ధ్రారణపై కళ్లకు కట్టే సన్నివేశం. కేవలం పెళ్లి, ఫంక్షన్లు వంటి ప్రత్యేక సందర్భాలలోనే కాకుండా నిత్యం పనిచేసే ఆఫీసులలో కూడా ఉద్యోగినుల వస్త్ధ్రారణ నీట్‌గా అందర్ని ఆకర్షించేలా ఉండాలని కార్పోరేట్ సంస్థలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇది వారి వ్యక్తిత్వాన్ని ఇనుమడింపజేసే విధంగానే ఉండటంతో ఉద్యోగినులు సైతం అభ్యంతరం వ్యక్తంచేయటం లేదు.
గతంలోఆఫీసులకు ఉరుకులు పరుగులతో వచ్చే అతివలు తమ మనసుకు నచ్చే డ్రెస్స్ ఎంపికచేసుకుని వెళ్లే తీరిక లేక నానాపాట్లు పడేవారు. వారంలో ఒక్కరోజు కాస్తంత వెసులుబాటు చూసుకుని మనసుకు నచ్చిన చీర కట్టుకుని వెళ్లాలనుకుంటే ఓ మధ్యతరగతి ఉద్యోగినికి ప్రళయం వచ్చినట్లే. కాని ఆధునిక ఉద్యోగినులు ఒంపు సొంపులతో పాటు మేనికి నచ్చే వస్త్ధ్రారణ పట్ల మక్కువ చూపించాలని, అపుడే తమకు ఆఫీసులలో తగినంత గౌరవం దక్కుతుందని అనుకుంటున్నారు. పుస్తకం కొనుగోలు చేయాలంటే రచయిత పేరుతో పాటు కవర్‌పేజీ బొమ్మను కూడా చూస్తాం. అలాగే ఉద్యోగినిపై తోటి ఉద్యోగులకు మంచి అభిప్రాయం కలగాలంటే ఆమె వస్త్ధ్రారణను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రొఫషనల్‌గానూ, పర్సనల్‌గానూ ఆఫీసులోవ్యక్తిత్వాన్ని ఇనుమడింపజేసుకోవాలంటే వస్త్ధ్రారణ తోడ్పడుతోంది.
కొంతమంది మిగతావారి కన్నా ప్రత్యేకంగా ఉండాలను కుంటారు. అలాంటివారు తప్పకుండా మంచి దుస్తులనే ఎంపిక చేసుకుంటారు. కిటికీలో నుంచి మనకు కనపడే మేరకు ప్రపంచాన్ని ఏవిధంగా చూస్తామో అలాగే మనం ధరించే వస్త్రాలు మన జీవన గమనాన్ని తెలియజేస్తాయి. మేనికి అందంతో పాటు సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ఎంపిక చేసుకుంటే తోటి ఉద్యోగులతో హాయిగా పనిచేయగలుగుతారు. శరీరాకృతితో పాటు బాడీలాంగ్వేజ్‌ని, నడతను తెలియజేసే దుస్తులు నలుగురు మెచ్చేలా ఉండేలా చూసుకోవాలి. ఉద్యోగినుల్లో ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని కలుగజేసే వస్త్ధ్రారణ మొత్తం జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందనటంలో అతిశయోక్తి లేదు.
మొదటిసారి మనల్ని చూసేవారికి మనపట్ల మంచి అభిప్రాయం కలగాలంటే మంచి దుస్తులను ధరించి వెళ్లాలి. మొదటిసారి ఇంటర్య్వూకి వెళ్లినా.. ఎవరినైనా కలవాలనుకున్నా .. శరీరాకృతికి నప్పే వస్త్రాలను ధరిస్తే వారికి మనపట్ల సదభిప్రాయం ఏర్పడుతోంది. *