పోస్ట్‌ప్రొడక్షన్‌లో సోగ్గాడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున ద్విపాత్రాభినయంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణకృష్ణ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. నిర్మాత నాగార్జున మాట్లాడుతూ, తొలిసారిగా ఈ చిత్రంలో ఫుల్ కామెడీ పాత్రలో నటిస్తున్నానని, సోగ్గాడిగా, అమాయకుడిగా రెండు వైవిధ్యమైన పాత్రలు వుంటాయని, గ్రామీణ నేపథ్యంలో ఔట్ అండ్ ఔట్ కుటుంబ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తండ్రి పాత్ర దయ్యంగా కన్పిస్తుందని తెలిపారు.
తండ్రి చనిపోయాక కొడుకుకు మాత్రమే కన్పడే విచిత్రమైన పాత్ర అదని, ఈ పాత్ర నచ్చి ద్విపాత్రాభినయం చేస్తున్నానని తెలిపారు. రెండు పాత్రలను దృష్టిలో పెట్టుకుని ‘సోగ్గాడే చిన్నినాయన’ పేరును నిర్ణయించామని, మైసూరులో చేసిన భారీ షెడ్యూల్‌లో చిత్రీకరించిన సీన్లన్నీ ప్రేక్షకులకు నచ్చుతాయని, మంచి తేదీ చూసి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, బ్రహ్మానందం, సంపత్, నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, దీక్షాపంత్, సురేఖావాణి, బెనర్జి, దువ్వాసి మోహన్, రామరాజు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కథ:పి.రాంమోహన్, స్క్రీన్‌ప్లే:సత్యానంద్, కెమెరా:పి.ఎస్.వినోద్, సంగీతం:అనూప్ రూబెన్స్, ఎడిటింగ్:ప్రవీణ్‌పూడి, నిర్మాత:అక్కినేని నాగార్జున, మాటలు, దర్శకత్వం:కల్యాణకృష్ణ.