రాష్ట్రీయం

నాగార్జునసాగర్ గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: ఎగువ నుంచి వరద పెరుగుతుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 16 క్రస్ట్ గేట్లను అధికారులు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 3,77,300 క్యూసెక్కులు కొనసాగుతుండగా ఔట్‌ఫ్లో 2,94,300 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 310.2522 టీఎంసీలుగా ఉంది. సాగర్ నుండి దిగువకు నీటి విడుదల విషయమై ముందస్తు నది పరివాహక ప్రాంత ప్రజలను, మత్స్యకారులను అప్రమత్తం చేశామన్నారు. గత నెలలో 12వ తేది నుండి 19వ తేది వరకు ఎనిమిది రోజుల పాటు సాగర్ ప్రాజెక్టు మొత్తం 26క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. మళ్లీ సాగర్ ప్రాజెక్టు గేట్టు తెరుచుకోవడంతో మరోసారి ప్రాజెక్టు వద్ధకు సందర్శకుల తాకిడి పెరుగనుంది.మరోవైపు పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉదృతి పెరుగడంతో ప్రాజెక్టు నుండి దిగువకు మూడుగేట్ల నుండి నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.77టీఎంసీలు, 175అడుగులకును 44.500టీఎంసీలు, 174.40అడుగులుగా ఉంది.