నల్గొండ

అమరవీరుల కుటుంబాలకు అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, అక్టోబర్ 20: విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని రాచకొండ కమిషనరేట్ యాదాద్రి జోన్ డిప్యూటీ కమిషనర్ పాలకుర్తి యాదగిరి తెలిపారు. గురువారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అమరవీరుల కుటుంభాల సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా డిసిపి యాదగిరి మాట్లాడుతు అమరవీరుల సేవలు ఎన్నటికీ మరిచిపోలేనివని తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో బాగంగా విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన మోయినొద్ధీన్, రత్నం, నాగరాజు, లక్ష్మయ్య, లింగయ్య, సుల్తాన్ మోయినొద్ధీన్‌ల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. వారికి రావల్సిన ప్రయోజనాలను అందించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.