నల్గొండ

ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకిరేకల్, అక్టోబర్ 20: ప్రజలు, రైతుల సంక్షేమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పూర్తిగా విస్మరిస్తున్నారని సిఎల్పీఉపనేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తిగా రుణమాఫీ చేయలేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఇళ్లు నిర్మించిందని, నాటి నిర్మాణకాలంలో ఇళ్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో లక్షలాది మంది లబ్ధిదారులు గృహనిర్మాణ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఈ పథకాన్ని కూడా కెసిఆర్ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.