నల్గొండ

ఆకస్మిక తనిఖీలతో అదరగొడుతున్న కలెక్టర్ గౌరవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 20: నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ జిల్లా పరిపాలనలో తనదైన ముద్ర వేసే దిశగా సాగుతున్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిపైన, సాగుతాగునీటి ప్రాజెక్టుల పనులపైన ఒకవైపు శాఖల వారిగా వరుస సమీక్షలు సాగిస్తునే ఇంకోవైపు క్షేత్ర స్థాయి ఆకస్మిక పర్యటనలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కలెక్టర్ వ్యవహారశైలి ఏమిటో ఇప్పటికే అర్ధం చేసుకున్న అధికారులు, ఉద్యోగులు విధులలో అలసత్వాన్ని వదిలించుకుని జవాబుదారి మార్గంలో పనిచేసే దిశగా అడుగులేయక తప్పదని గ్రహిస్తున్నారు. హరిత హారం, మిషన్ భగీరథ, డిండి ప్రాజెక్టు, ఎఎమ్మార్పీ ప్రాజెక్టుల పనుల నిర్వాహణ, ధాన్యం సేకరణ, ఆసుపత్రులు, పాఠశాలల సక్రమ నిర్వాహణ అంశాలపై కలెక్టర్ ప్రధానంగా ఫోకస్ చేస్తు ముందుకెలుతున్నారు. వరుసగా బతుకమ్మ ఉత్సవాలు, జిల్లాల పునర్విభజనల మధ్య స్తబ్ధతకు గురైన ప్రభుత్వ యంత్రాంగాన్ని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సుడిగాలి సమీక్షలు, ఆకస్మిక తనిఖీలు మెరుగైన విధి నిర్వాహణ వైపు నడిపిస్తున్నాయి.
సుడిగాలి పర్యటనలు.. సమీక్షలు
కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతు పారదర్శక పాలన, అట్టడుగువర్గాలకు సంక్షేమ పథకాలను అందించడం, హరిత హారం ప్రధాన లక్ష్యమంటు తన ఉద్ధేశాలను వెల్లడించారు. జిల్లా ప్రజలు ఎదుర్కోంటున్న ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన సాగుతాగునీటి పథకాల పనులను వేగవంతంపై దృషి పెడుతానన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో మారుమూల ప్రాంతాల్లో సైతం పర్యటించే వీలున్నందునా ఆ ప్రాంత ప్రజల అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. అన్నమాటలను కార్యరూపంలోకి తెస్తు వివిధ శాఖల కార్యక్రమాల పురోగతిపై, సిబ్బంది పనితీరుపై వరుస సమీక్షలు చేపట్టారు. మారుమూల దేవరకొండ, డిండి, అడవిదేవులపల్లి, దామరచర్ల, మిర్యాలగూడ, గుర్రంపోడు మండలాల్లో పర్యటించారు. ఆ మండలాల ఎంపిడివో, తహశీల్ధార్ కార్యాయాల్లో, ఆసుపత్రులను ఆకస్మికంగా సందర్శించి శాఖ పరమైన రికార్డులు తనిఖీ చేసి, అక్కడికి వచ్చిన ప్రజల విన్నపాల స్వీకరించి అధికారుల పనితీరుపై వారిని ఆరాతీశారు. విధులకు గైర్హాజరైన దామరచర్ల పిహెచ్‌సి వైద్యుడిపై చర్యలకు ఆదేశించారు. చెరువులకు వెళ్లి చేపపిల్లలను వదిలారు. కుత్తూర్ తండా, చిట్యాల వద్ధ మిషన్ భగీరథ పైప్‌లైన్, ఇంటెల్ వెల్ పనులను పరిశీలించారు. డిండి ప్రాజెక్టును సందర్శించి డిండి ఎత్తిపోతల పథకం భూసేకరణను సమీక్షించారు. దేవరకొండ జడ్పీ హైస్కూల్‌ను ఆకస్మిక తనిఖి చేసి, పాత భవనాలను పరిశీలించి విద్యార్థుల సమస్యలు విన్నారు. గిరిజన గురుకుల పాఠశాలలను, ఏరియా ఆసుపత్రిని, బిసి సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులకు, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. గుర్రంపోడు మండలం మొసంగి చెరువుకు వెళ్లి చేప పిల్లలను వలిలారు. మత్స్యకారుల సమస్యలను విన్నారు. వరుస సమీక్షలకు సమాంతరంగా మండల స్థాయిలో, గ్రామస్థాయిలో అన్ని శాఖల అధికారుల, సిబ్బంది పనితీరును క్షేత్ర స్థాయి తనిఖీలు చేస్తు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సాగిస్తున్న పర్యటనలు కొత్త జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకంగా సైతం కనిపిస్తున్నాయి. స్వతహాగా వైద్యుడైన గౌరవ్ ఉప్పల్ సర్కార్ ఆసుపత్రుల సమస్యలపై ఘాటుగానే స్పందిస్తున్నారు. గౌరవ్ ఉప్పల్ పాలనా శైలితో సిబ్బంది పనితీరు మెరుగుపడి ప్రజలకు మెరుగైనా ప్రభుత్వ సేవలందుతాయన్న ఆశాలను రేకెత్తిస్తున్నాయి. ఉప్పల్ సారధ్యంలో జిల్లాలోని పెండింగ్ సాగుతాగునీటి ప్రాజెక్టుల పనుల్లో, వౌలిక వసతుల కల్పనా పథకాల అమలు వేగవంతమవుతాయన్న ధీమా ప్రజాప్రతినిధుల్లో వ్యక్తమవుతుంది. కాగా కొత్త జిల్లాల ఏర్పాటుతో నల్లగొండ కలెక్టరేట్ నుండి యాదాద్రి, సూర్యాపేటలకు 60శాతం సిబ్బంది, ఫైల్స్, ఫర్నిఛర్, ఉద్యోగులు వెళ్లిపోవడంతో కలెక్టర్ భవనంలో చాలగదులు బోసిపోయి దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రం నలువైపుల సుదూరంగా పడేసివున్న పలు కార్యాలయాలను కలెక్టరేట్‌లోకి రప్పిస్తే అద్దెలకు, విద్యుత్ వంటి వసతులకు చెల్లిస్తున్న ప్రజాధనం ఆదా జరుగడటంతో పాటు ప్రజలకు అన్ని కార్యాలయాల సేవలు ఒకే చోట లభించే అవకాశముంది. ఈ దిశగా కలెక్టర్ ఉప్పల్ దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.