నల్గొండ

విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, నవంబర్ 4: విధులపట్ల అలసత్వం ప్రదర్శించే వైద్యసిబ్బందిపై చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తండు మురళీమోహన్ స్పష్టం చేశారు. అనంతగిరి పిహెచ్‌సిని శుక్రవారం డియంహెచ్‌వో డాక్టర్ మురళీమోహన్ తనిఖీ చేశారు. పిహెచ్‌సిలోని వసతులను, సిబ్బంది హాజరును ఆయన పరిశీలించి పిహెచ్‌సి పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు మరింత కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు వైద్యసిబ్బంది అందుబాటులో వుండి సత్వర వైద్యసేవలను ఎప్పటికప్పుడు అందించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలోని అన్ని పిహెచ్‌సిల్లో నూరుశాతం కాన్పులు జరిగేవిధంగా చర్యలు తీసుకొంటున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం విస్తరిస్తున్న సీజనల్ వ్యాధులపట్ల ప్రజలు, ఆరోగ్యసిబ్బంది అప్రమత్తంగా వుండాలని ఆయన కోరారు. సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు సోకిన ప్రజలకు వైద్య సిబ్బంది సత్వర వైద్యం అందించాలని ఆయన సూచించారు. డెంగ్యూవ్యాధి పేరిట వ్యాధి నిర్ధారణ పరీక్షలను చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవారిపై చర్యలు తీసుకొంటామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు ఆయన చెప్పారు. అవసరమైన సిబ్బంది, సౌకర్యాలను ప్రభుత్వ వైద్యశాలల్లో ఏర్పాటుచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా నాగారం పిహెచ్‌సిలో ప్రారంభించిన్నట్లు ఆయన వెల్లడించారు. తదుపరి అన్ని పిహెచ్‌సిలో టెలిమెడిసిన్ అందుబాటులోకి వస్తుందని డియంహెచ్‌వో డాక్టర్ మురళీమోహన్ చెప్పారు. కార్యక్రమంలో కోదాడ యస్‌పిహెచ్‌వో డాక్టర్ నిరంజన్, డెమో తిరుపతిరెడ్డి, వైద్యాధికారులు డాక్టర్ స్వర్ణశ్రీ, డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి, డాక్టర్ సంజయ్‌కుమార్, డాక్టర్ ప్రమోద్‌కుమార్, తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు యం.సుదర్శన్, కోదాడ అద్యక్షులు యాతాకుల మాధుబాబు, సిబ్బంది యాదగిరి, సత్యం, యం.శ్రీను తదితరులు పాల్గొన్నారు. తదుపరి డియంహెచ్‌వోను తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం, వైద్యాధికారులు, తెరాస నాయకులు సన్మానించారు.