నల్గొండ

సీజనల్ వ్యాధుల నివారణపై విస్తృత ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, నవంబర్ 6: సీజనల్ వ్యాధులు, విజజ్వరాల నివారణ దిశగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా యంత్రాంగం విస్తృత ప్రచారం అవగాహాన కల్పించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. ఆదివారం ఆయన కలెక్టర్ బంగ్లాలో వైద్య, ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమశాఖలు, జాతీయ కిటకజనిత వ్యాధులు నివారణ చర్యలపై రూపొందించిన దోమల నివారణ చర్యల ప్రచార పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు. దోమల నివారణకు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను పంచాయతీలు, వైద్య ఆరోగ్యశాఖ, అంగన్‌వాడీ, ఆర్‌డబ్ల్యుఎస్ విభాగాలు తగిన కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. పారిశుద్ధ్యం పరిరక్షణ, దోమల నివారణ చర్యలపై పోస్టర్లను ప్రతి పిహెచ్‌సికి, పంచాయతీకి అందించి గ్రామాల్లో వీధుల్లో అంటించి, కరపత్రాలను పంపిణీ చేసి ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. విషజ్వరాల పట్ల ప్రజల అవగాహాన రాహిత్యాన్ని ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకునే వ్యవహారం తగదన్నారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించే వైద్య ఆరోగ్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్‌వో భానుప్రసాద్‌ను ఆదేశించారు. విద్యార్థుల్లో పారిశుద్ధ్యం, రక్షిత మంచినీరు, దోమల నివారణ చర్యలపై ప్రచారం చేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలల భవనాలపై నివేదికలు అందించి కొత్త వాటి మంజూరుకు ప్రయత్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఈవో చంద్రమోహన్, డిపిఆర్‌వో ముర్తాజా తదితరులు ఉన్నారు.